Krishnam Raju Final Rites: రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి ప్రభాస్ ఫ్యామిలీని సందర్శించి నివాళులర్పించారు. మొదట కృష్ణంరాజు అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహిస్తారని అనుకున్నారు.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఉన్న కృష్ణంరాజు ఫాంహౌస్ లో అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే కృష్ణంరాజుకు మగ సంతానం లేదు. దీంతో ఆయన సోదరుడి కుమారుడు ప్రభాస్ తనకు వారసుడు అని గతంలో ప్రకటించారు. సినిమాల్లోనూ ప్రభాస్ ను హైలెట్ చేశాడు. టాలీవుడ్ లో తన వారసుడిగా ప్రమోట్ చేశాడు. ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగడంలో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.
Also Read: Ram Gopal Varma Tweet: మన మీద మనమే ఉమ్మేసుకోవడమే ఇది, అగ్రహీరోల తీరుపై వర్మ షాకింగ్ కామెంట్స్
అయితే తన వారసుడిగా ప్రభాస్ ను ప్రకటించినా కూడా కృష్ణంరాజుకు ఆయన తలకొరివి పెట్టడం లేదు. ప్రభాస్ ను అంతగా ప్రేమించే కృష్ణంరాజుకు ప్రభాస్ ఎందుకు తలకొరవి పెట్టడం లేదని అందరూ ఆరాతీయగా అసలు విషయం తెలిసింది.
ప్రభాస్ కు ఉపనయనం జరగలేదు. కృష్ణంరాజు క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో సంప్రదాయం ప్రకారం.. ఉపనయనం జరిగితేనే వారు తలకొరివి పెట్టడానికి అర్హులవుతారు. దీంతో ప్రభాస్ కు అన్నయ్య ప్రబోధ్ ఉండడంతో అతడికి పెళ్లి అయ్యి ఉపనయనం కూడా కావడంతో ప్రబోధ్ చేతులమీదుగానే ఈ అంత్యక్రియల ఘట్టం కొనసాగుతోంది. కృష్ణంరాజు ప్రబోద్ తలకొరివి పెడుతున్నారు.

ప్రభాస్ కు స్వయానా అన్నయ్య ప్రబోద్. హిందూ సంప్రదాయం ప్రకారం ఒకరు కంటే ఎక్కువమంది కుమారులు ఉంటే వారిలో తండ్రికి పెద్ద కుమారుడు తలకొరివి పెడుతారు. అందరికంటే చిన్న కొడుకు తల్లికి తలకొరివి పెడుతారు. ఈ నేపథ్యంలోనే తలకొరివి పెట్టేందుకు ప్రభాస్ దూరంగా ఉన్నారు. ప్రభాస్ కు బదులు ఆయన అన్నయ్య ప్రబోద్ తలకొరివి పెడుతున్నారు.
Also Read:AP and Telangana Electricity Dues Issue: కేసీఆర్, జగన్ మధ్య ‘కరెంట్’..మధ్యలో ‘కేంద్రా’నికి షాక్