Ajith: తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్(Thala Ajith Kumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని, భారీ వసూళ్లతో ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో అజిత్ నటించిన చిత్రాలలో అభిమానులను అన్ని విభాగాల్లో సంతృప్తి పరిచిన చిత్రమిదే. మొదటి నాలుగు రోజుల్లోనే దాదాపుగా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఫుల్ రన్ లో 300 కోట్లు రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే అజిత్ మిగతా హీరోలు లాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి రావడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం వంటివి చేయడు. కానీ ఆయనతో పని చేసే మూవీ టీం మాత్రం ప్రొమోషన్స్ గట్టిగానే చేస్తూ ఉంటుంది.
Also Read: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆద్విక్ రవించంద్రన్, సునీల్, నిర్మాత నవీన్, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ ఈవెంట్ లో పాల్గొని ఈ సినిమా తాలూకు అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్(Advik Ravichandran) మాట్లాడిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘సినిమా విడుదలైన తర్వాత అజిత్ సార్ తో నేను మాట్లాడాను. ఆయన నాతో చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది, చాలా సంతోషం, కానీ సక్సెస్ ని నెత్తికి ఎక్కించుకోకు, అపజయాన్ని నీతో పాటు ఇంటికి తీసుకెళ్లకు, నీ తదుపరి ప్రాజెక్ట్ ని ఇంతకంటే అద్భుతంగా ఎలా తియ్యాలో ఆలోచించు అని చెప్పారు’ అంటూ చెప్పుకొచ్చాడు అద్విక్. ఆయన మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఎందుకంటే గతంలో ‘దువ్వాడ జగన్నాథం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్(Harish Shankar) పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనతో మాట్లాడిన మాటలను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాతో ఒక మాట చెప్పారు. గుర్తు పెట్టుకో హరీష్. ఇప్పుడు నీకు చాలా పెద్ద హిట్ వచ్చింది. ఇక్కడి నుండి జాగ్రత్తగా ఉండాలి. సక్సెస్ ఒక మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏది పడితే అది చేయమని ప్రేరేపిస్తుంది. కాబట్టి సక్సెస్ ని నెత్తికి ఎక్కించుకోకు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గ్రాండ్ సక్సెస్ అయినప్పుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ ‘వెంకటేష్(Victory Venkatesh) సార్ కి ఫోన్ చేసి మన సినిమాకి వస్తున్న కలెక్షన్స్ గురించి చెప్తుంటే, అనిల్ కూల్ డౌన్..వదిలేయ్, నెత్తికి ఎక్కించుకోకు, తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచించు అని చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఒకప్పుడు పవన్ కళ్యాణ్, వెంకటేష్ మాట్లాడిన మాటలే అజిత్ కూడా మాట్లాడాడు, వీళ్ళ ముగ్గురి మనస్తత్వం ఒక్కటే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
