Prabhas: ఇండియాలోనే టాలీవుడ్ అతిపెద్ద మార్కెట్ గా ఎదిగింది. తెలుగు హీరోలు వందల కోట్ల మార్కెట్ సంపాదించారు. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాల హీరో అయ్యాడు. సినిమాకు రూ. 100 నుండి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ తో మూవీ చేయాలంటే కనీసం నాలుగు వందల కోట్లు కావాలి. ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రాల బడ్జెట్ మొత్తం కలిపితే వెయ్యి కోట్లు దాటిపోతుంది. ప్రభాస్ తర్వాత పుష్ప తో అల్లు అర్జున్, ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇండియా వైడ్ మార్కెట్ సంపాదించారు. మరి టాలీవుడ్ స్టార్స్ లో నెంబర్ వన్ ఎవరు? ఇండియా వైడ్ ఎవరికి పాపులారిటీ ఉంది? అనే విషయాలపై లేటెస్ట్ సర్వే రిజల్ట్స్ ఇలా ఉన్నాయ
ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దీనిపై సర్వే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంది. ఇక ఆగస్టు నెలకు గాను టాలీవుడ్ టాప్ స్టార్ ర్యాంక్ ప్రభాస్ కి దక్కింది. మెజారిటీ ఆడియన్స్ తమ ఫేవరేట్ హీరోగా ప్రభాస్ పేరు చెప్పారు. దీంతో ఆయన 1వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. ఇక 2వ ర్యాంక్ ఎన్టీఆర్ కైవసం చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది.
ఆ మధ్య ప్రభాస్ ని కూడా వెనక్కి నెట్టి ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ అందుకున్నాడు. తాజా సర్వేలో ఎన్టీఆర్ రెండవ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక 3వ ర్యాంక్ అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప మూవీతో దేశాన్ని ఊపేసిన ఈ స్టార్ హీరో టాలీవుడ్ స్టార్స్ ర్యాంకింగ్స్ లో మూడవ స్థానం సంపాదించారు. మరో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ 4వ స్థానంలో నిలిచాడు. సూపర్ స్టార్ మహేష్ కి 5వ స్థానం దక్కింది. టాప్ ఫైవ్ లో వరుసగా ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ నిలిచారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6వ స్థానానికి పరిమితం అయ్యారు. చాలా కాలంగా ఆయన ఆరవ స్థానంలో కొనసాగుతున్నారు. గత సర్వేల్లో కూడా పవన్ కి టాప్ ఫైవ్ లో చోటు దక్కలేదు. ఇది దేశవ్యాప్తంగా జరిగే సర్వే కావడంతో ఆయన రేసులో వెనుకబడుతున్నారు. ఇక 7వ స్థానంలో నాని, 8వ స్థానంలో విజయ్ దేవరకొండ, 9వ స్థానంలో చిరంజీవి, 10వ స్థానంలో రవితేజ నిలిచారు. సీనియర్ హీరోల్లో ఒక్క చిరంజీవికి మాత్రమే టాప్ టెన్ లో చోటు దక్కింది. వచ్చే నెలలో ఈ ర్యాంకింగ్స్ మారిపోవచ్చు.