Prabhas as a former Naxalite: ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోల్లో విభిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని థ్రిల్ కి గురి చేస్తున్న ఏకైక హీరో ప్రభాస్(Rebel Star Prabhas). ఆయన ముట్టుకోని జానర్ అంటూ ఏది లేదు. పౌరాణికం, జానపదం, యాక్షన్, మాస్,క్లాస్, లవ్ స్టోరీ, పీరియడ్ ఇలా అన్ని రకాల జానర్స్ ని కవర్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ‘రాజా సాబ్’ చిత్రం తో హారర్ జానర్ ని కూడా కవర్ చేయబోతున్నాడు. ఇది కాసేపు పక్కన పెడితే ప్రభాస్ ఫిల్మోగ్రఫీ లో మిస్ అయిన ఏకైక జానర్ పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఇప్పటి వరకు ఆయన ఖాకీ చొక్కా ఒక్క సినిమాలో కూడా వేసుకోలేదు. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పటికే పోలీస్ రోల్స్ ప్రభాస్ కంటే ముందే చేసేసారు. అయితే ఇప్పుడు ఆయన సందీప్ వంగ తో చేయబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లోనే కనిపించబోతున్నాడు.
ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో టీజర్ విడుదలై ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఆడియో ని విని చెప్పేయొచ్చు, ప్రభాస్ ఎంతటి పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నాడు అనేది. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన ట్విస్ట్ ఉంటుందట. అదేమిటంటే ఇందులో ప్రభాస్ తన ఫ్లాష్ బ్యాక్ లో నక్సలైట్. ఒక నక్సలైట్ కొన్ని పరిస్థితుల కారణంగా పోలీస్ గా ఎలా మారాడు? , పోలీస్ అయ్యాక ఆయన ఎలాంటి ఆపరేషన్స్ చేసాడు అనేది థీమ్ స్టోరీ గా ఉండబోతుంది అట. నక్సలైట్, పోలీస్ పాము, ముంగీస లాంటి వాళ్ళు. ఇది వరకు మనం ఎన్నో వందల నక్సలైట్స్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేయడం, నక్షలైట్ లు పోలీసుల పై బాంబు దాడులు చేయడం, ఇలా ఎన్నో రకాల వార్తలు మనం వింటూ పెరిగాము.
అలా రెండు విభిన్నమైన వృత్తులు ఒకే మనిషి చేయడం అనే పాయింట్ వినడానికే ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ. దీనిని డైరెక్టర్ సందీప్ వంగ తన స్టైల్ లో పవర్ ఫుల్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎక్కడ మొదలై, ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. గతం లో మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే నక్సలైట్ క్యారక్టర్ చేసాడు. జల్సా ఫ్లాష్ బ్యాక్ లో మనం ఆయన్ని ఆ క్యారక్టర్ లో చూడొచ్చు. మళ్లీ ఆ షేడ్ ఉన్న క్యారక్టర్ ప్రభాస్ మాత్రమే చేస్తున్నాడు. ఇది ఆయనకు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. వచ్చే ఏడాది చివరి లోపు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.