Radhe Shyam: నేషనల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రాథేశ్వామ్’ నిర్మాతల పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో ఉంది. సినిమాని ఎప్పుడు విడుదల చేయాలో అర్ధం కావడం లేదు. ఏ డేట్ చూసుకున్నా.. మిగిలిన బాషలలో గట్టి పోటీ కనిపిస్తుంది. అసలుకే ‘రాథేశ్వామ్’ పై ఎలాంటి అంచనాలు లేవు. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించడానికి రెడీ అవ్వడం, మళ్ళీ వెనక్కి తగ్గడం ‘రాథేశ్వామ్’ నిర్మాతలకు ఆనవాయితీ అయిపోయింది.
గత వారమే ‘రాధేశ్యామ్’ షూటింగ్ కి గుమ్మడికాయ కూడా కొట్టేశారు. నిజానికి ఎప్పుడో 2018 సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన ఏదోక పని జరుగుతూనే ఉంది. నాలుగేళ్లు ఆగుతూ, సాగుతూ షూట్ జరుపుకున్నా ఇంకా ఈ సినిమా పూర్తీ కాకపోవడం నిజంగా విచిత్రమే.
ఒక విధంగా ప్రభాస్ బాహుబలి కన్నా, ఈ సినిమాకే ఎక్కువ టైం కేటాయించాడు. కానీ బాహుబలి ప్రభాస్ కి ఒక స్థాయి క్రియేట్ చేస్తే.. ‘రాధేశ్యామ్’ ఆ స్థాయిని డ్యామేజ్ చేసేలా ఉంది. దీనికి తోడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ఇది రెండో చిత్రం. పైగా మొదటి సినిమా జిల్ ప్లాప్.
అన్నిటికీ మించి ‘రాధేశ్యామ్’కి భారీ బడ్జెట్ పెట్టారు. ఈ కొత్త డైరెక్టర్ సినిమాని ఎలా హ్యాండిల్ చేసాడో ? అందుకే బయ్యర్లు కూడా ఎవ్వరూ ఈ సినిమా పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రభాస్ సినిమా అంటే.. నేషనల్ వైడ్ గా మంచి మార్కెట్ అవుతుంది. కానీ, ‘రాధేశ్యామ్’విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది వ్యవహారం.
పైపెచ్చు ఈ సినిమా పూర్తిగా ప్రేమకథా చిత్రం. గ్రాఫిక్స్, సెట్స్ గట్రా సహజంగా లేవు అనే టాక్ కూడా అప్పుడే బయటకు వచ్చేసింది. మరీ చూడాలి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ కి ఏ రేంజ్ డ్యామేజ్ చేస్తోందో. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.