Prabhas Maruthi Movie: ప్రస్తుతం వరస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. కాగా ఈ భారీ సినిమాల మధ్యలో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది ప్రభాస్-మారుతి సినిమా. ఈ మూవీకి ‘డీలక్స్ రాజా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోయిన ప్రభాస్.. ఇప్పుడు తన కెరీర్‌లోనే ఏకైక తక్కువ బడ్జెట్ సినిమాలో నటిస్తుండడం అందర్నీ షాకింగ్ కు గురిచేస్తోంది. లిమిటెడ్ బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాస్త కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్ డేట్ బయటకొచ్చింది.
అదేమిటి అంటే సినిమాలో హీరో హీరోయిన్ల సీనియర్ షూటింగ్ కు రంగం సిద్ధమైందట. ఈ రోజు నిధి అగర్వాల్ కాస్ట్యూమ్స్ సెలక్షన్ ప్లస్ గెటప్ కోసం ఫొటో షూట్ జరిగిందట. ఇక ఈ చిత్రంలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని, ప్రభాస్ నిధి అగర్వాల్ మధ్యలో వచ్చే సీన్స్ డార్లింగ్ ను ప్రభాస్ ని గుర్తు చేస్తాయని అంటున్నారు. ఇక ఇలాంటి వార్త వినడంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో నిధి అగర్వాల్ తో పాటు మాళవికా మోహనన్ కూడా హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
కాగా మారుతీ అండ్ టీం ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని కూడా శరవేగంగా చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు సినిమా చాలా బాగా రూపుదిద్దుకుంటుందని కూడా సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అతడు ప్రభాస్ కు తాతగా కనిపించనున్నాడట. నిన్నటివరకు ప్రభాస్ తండ్రి పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ అది తండ్రి పాత్ర కాదని, తాత పాత్ర అని తెలుస్తోంది.