
Prabhas And Krishnamraju: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరో ఎవరంటే.. ప్రభాస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా నటుడిగా ఎదిగాడు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. రూ.100 కోట్లకు తక్కువగా కాకుండా ఆయనతో సినిమాలు చేస్తున్నారు. అంతేకాకుండా వరుసబెట్టి సినిమాలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది గానీ.. ప్రభాస్ పర్సనల్ లైఫ్ విషయానికొచ్చేసరికి మాత్రం ఓ మైనస్ ఉండిపోతుంది. అదే ఆయన పెళ్లి. ఇంతకాలంగా ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణాలేంటనేది ఎప్పటికీ జరుగుతున్న చర్చే. కానీ ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి ఆయన పెద్దనాన్నకృష్ణం రాజు కారణమని కొందరు సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘ఛత్రపతి’తో స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సినిమాలు చేసి ఆల్ రౌండర్ హీరో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఎందరో ముద్దుగుమ్మలు ప్రభాస్ తో నటించాలని ఇష్టపడుతుంటారట. ఈ క్రమంలో ఆయనతో రొమాన్స్ చేయడానికి కూడా వెనుకాడరట. అయితే ప్రభాస్ కొందరితో ఎక్కువగా చనువుగా ఉంటూ వచ్చారట. అలా ఉంటున్నవారితో ప్రభాస్ ప్రేమాయణం సాగిస్తున్నారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ ప్రభాస్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదట.
ప్రభాస్ కెరీర్లో వర్షం సినిమా ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో ఆయన త్రిషతో కలిసి నటించాడు. వర్షం సినిమాలో ప్రభాస్, త్రిషల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రియల్ లవర్స్ లాగే వీళ్లు నటించారు. అయితే ఈ సినిమా సక్సెస్ తరువాత మళ్లీ ఈ జోడీ కలిసి పౌర్ణమిలో కనిపించింది. ఇందులో రొమాన్స్ హద్దులు దాటింది. దీంతో ప్రభాస్, త్రిషల మధ్య ఏదో ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై ప్రభాస్ ఏం చెప్పలేకపోయాడు. ఆ తరువాత ప్రభాస్ కాజల్ ల మధ్య డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాల్లో కెమిస్ట్రీ కుదిరింది. దీంతో వీళ్లు ప్రేమలో పడ్డారని అనుకున్నారు. కొందరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేశారు. ఇక అనుష్క, ప్రభాస్ ల మధ్య ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కొందరు వీళ్లు పెళ్లి కూడా చేసేకున్నారని రకరకాల పోస్టులు పెట్టారు. కానీ ఈ ఇద్దరూ తాము ఫ్రెండ్స్ మాత్రమే అని డిక్లేర్ చేశారు.
అయితే కొందరి ప్రచారం ప్రకారం.. ఈ ముగ్గురితో ప్రభాస్ లవ్ జర్నీ చేశాడని అంటున్నారు. ఈ విషయాన్ని పెద్దనాన్న కృష్ణం రాజుకు తెలియడంతో ఆ ముగ్గురిని రిజెక్ట్ చేశారని ప్రచారం సాగుతోంది. అందుకే ప్రభాస్ కు ఇక పెళ్లిపై విరక్తి పుట్టిందని, అందుకే పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదని కొందరు అంటున్నారు. అయితే కృష్ణం రాజు సైతం ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మరి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలనై ఆయన స్పందిస్తారా..? లేదా..? చూడాలి.
Recommended Videos
