AP Liquor Issue: ఏపీలో మద్యం నిషేధం లేనట్టే.. లిఖితపూర్వకంగా తెలిపిన జగన్ సర్కారు

AP Liquor Issue: అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ బాండ్లు విక్రయించి చంద్రబాబు సర్కారు రూ.2వేల కోట్లు అప్పు చేసింది. గుర్తుంది కదూ… అది అమరావతి నగరాభివృద్ధి కోసం. ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే బాటలో నడుస్తోంది. బాండ్లను విక్రయించి రూ.8 కోట్లు అప్పు తెచ్చింది. అవి భూముల బాండ్లు కావు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్ల అవి. వాటిని విక్రయించి రుణం పొందుతుందన్న మాట. అంటే దాదాపు మద్యం నిషేధం లేదని తేలిపోయిందన మాట. విపక్షంలో ఉన్నప్పుడు […]

Written By: Dharma, Updated On : June 12, 2022 10:40 am
Follow us on

AP Liquor Issue: అమరావతి డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ బాండ్లు విక్రయించి చంద్రబాబు సర్కారు రూ.2వేల కోట్లు అప్పు చేసింది. గుర్తుంది కదూ… అది అమరావతి నగరాభివృద్ధి కోసం. ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే బాటలో నడుస్తోంది. బాండ్లను విక్రయించి రూ.8 కోట్లు అప్పు తెచ్చింది. అవి భూముల బాండ్లు కావు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బాండ్ల అవి. వాటిని విక్రయించి రుణం పొందుతుందన్న మాట. అంటే దాదాపు మద్యం నిషేధం లేదని తేలిపోయిందన మాట. విపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ సంపూర్ణ మద్య నిషేధానికి హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేనందున ప్రాధాన్యతాక్రమంలో మద్యం షాపులు తగ్గించి నాలుగేళ్లలో పూర్తిగా నిషేధిస్తామని చెప్పుకొచ్చారు. ఆ గడువుకు ఇంకా ఏడాదే ఉన్నా ఆ సంకేతాలేవీ కనిపించడం లేదు. ఇప్పుడు ఏకంగా బేవరజేస్ కార్పొరేషన్ బాండ్లు విక్రయించడం ద్వారా నిషేధమే లేదని తేల్చేశారు. దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం… అని హామీ ఇచ్చిన జగన్‌ సర్కారు మూడేళ్లలో అనేక పిల్లిమొగ్గలు వేసింది. పైగా… మద్యాన్ని ‘అస్మదీయులకు’ ఆదాయం తెచ్చి పెట్టే మార్గంగా మలచుకున్నారు.

JAGAN

తగ్గని షాపులు..
అధికారంలోకి వచ్చీ రాగానే ‘కొత్త మద్యం పాలసీ’ పేరుతో షాపులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చింది. తొలి విడత 830 షాపులు తగ్గించింది. అనంతరం కరోనా కాలంలో మరో 500 తగ్గించింది. ప్రస్తుతం 2,930 షాపులను నడుపుతోంది. రెండేళ్లలో ఒక్క షాపు కూడా తగ్గించలేదు. పైగా.. ‘లిక్కర్‌ మాల్స్‌’ను తెరపైకి తెచ్చారు. ‘మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకు’ అంటూ ధరలు భారీగా పెంచారు. దీంతో అమ్మకాలు పడిపోవడంతో కుంటిసాకులు చెబుతూ మళ్లీ ధరలు తగ్గించేశారు.

Also Read: Mamata Banerjee- CM KCR: తెలుగు రాష్ట్రాలను పట్టించుకోని దీదీ.. కేసీఆర్ ఒక్కరికే ఆహ్వానం

మద్యం అమ్మితేనే సంక్షేమ పథకాలు అమలుచేయగలమని నిర్మొహమాటంగా చెప్పారు. అమ్మఒడి, చేదోడు, చేయూ త పథకాలను మద్యం ఆదాయంతోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2021-22లో రూ.19,500 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి రూపాయికీ వెతుక్కుంటున్న సర్కారు ఇంత ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగాలేదు. ‘మద్య నిషేధం లేదు’ అంటూ అప్పులూ తెచ్చుకుంది.ఎన్నికల హామీలో, అధికారంలోకి వచ్చాక ‘మద్య నిషేధం’ అని పదేపదే చెప్పారు. ఆ తర్వాత ‘నిషేధం’ ఎత్తివేసి ‘నియంత్రణ’ తీసుకొచ్చారు. గతేడాది ఒక పత్రికా ప్రకటనలో తొలుత ‘మద్య నిషేధం’ అని రాసి, ఆ తర్వాత ‘నియంత్రణ’ అంటూ సవరణ జారీచేశారు. మంత్రులు, అధికార పార్టీ నేతలు కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడటం లేదు. ఎక్కడైనా విలేకరులు ప్రశ్నిస్తే ‘దశలవారీగా చేస్తామన్నాం కదా’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతున్నారు.

JAGAN

నిబంధనలకు విరుద్ధంగా..
రాష్ట్రం తరఫున మద్యం వ్యాపారం నిర్వహించే బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు నిర్వహణ చార్జీలు మాత్రమే ఇవ్వాలి. అదికూడా ఏటా అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక చెల్లించాలి. కానీ, రాజ్యాంగ నిబంధనకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వమే స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో జీవోలు ఇచ్చేసి, చట్టం సవరించి ఖజానా నుంచి మద్యం ఆదాయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించింది. ఈ ఆదాయాన్ని చూపించి ఎన్‌సీడీలు జారీచేసి రూ.8,300 కోట్లు అప్పు భారీ వడ్డీకి తీసుకొచ్చారు. ఇండియా రేటింగ్స్‌ సంస్థ బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. అందువల్లే ఎన్‌సీడీల కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారని… రూ.2,000 కోట్లు వస్తాయనుకుంటే రూ.8,300 కోట్లు వచ్చాయని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. అయితే.. మద్యం విధానం మార్చబోమని హామీ ఇవ్వాలనే షరతుకు సర్కారు అంగీకరించిన తర్వాత బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ‘ఏఏ’ రేటింగ్‌ లభించింది. రూ.8300 కోట్ల అప్పు కోసం రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కమీషన్లు ఎందుకు ఎవరికి చెల్లిస్తున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Also Read:BT3 Cotton Seeds: బీటీ పత్తి.. చెలకకు విపత్తి

Tags