Adipurush Twitter Talk: ఆదిపురుష్ మూవీ ట్విట్టర్ టాక్… ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్?

మొత్తంగా ఆదిపురుష్ ట్విట్టర్ టాక్ కొంత ఖేదం మరికొంత మోదం అన్నట్లుగా ఉంది. మొదటి నుండి బయపడుతున్నట్లే విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో ఓం రౌత్ ఆకట్టుకోలేకపోయారు. ప్రభాస్ వంటి హీరో నటించిన భారీ బడ్జెట్ మూవీలో కార్టూన్ తరహా గ్రాఫిక్స్ ఉంటే ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమే.

Written By: Shiva, Updated On : June 16, 2023 8:43 am

Adipurush Twitter Talk

Follow us on

Adipurush Twitter Talk: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా థియేటర్స్ లో దిగారు. జూన్ 16న ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదలైంది. నేడు తెల్లవారుజామునుంచే ఆదిపురుష్ మూవీ ప్రదర్శనలు మొదలయ్యాయి. ఆదిపురుష్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఆదిపురుష్ మూవీ ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఆదిపురుష్ చిత్రానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు ఆదిపురుష్ చిత్రం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఆదిపురుష్ మూవీ ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుందనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. దర్శకుడు ఓం రౌత్ మొదటి భాగం ఎంగేజింగ్ గా నడిపారు. అలాగే సాంగ్స్ బాగున్నాయి. బీజీఎం సైతం ఆకట్టుకుంది. రాముడిగా ప్రభాస్ పర్లేదు. ఆయనకు పాస్ మార్క్స్ వేయవచ్చు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

అయితే సెకండ్ హాఫ్ ఆకట్టుకోలేదు. ఓం రౌత్ కథనాన్ని సాగతీతకు గురి చేశాడు. నెమ్మదిగా నడిచే కథనం ఒకింత ఇబ్బంది పెట్టింది. విజువల్స్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఆదిపురుష్ సినిమాకు విజువల్స్ పెద్ద మైనస్ అంటున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నిరాశపరిచాడు. ఆయన ఈ కోణంలో కూడా రావణాసురుడిని గుర్తు చేయలేకపోయారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల విలన్ మాదిరి భిన్నంగా రావణాసురుడి లుక్ ఉందంటున్నారు.

మొత్తంగా ఆదిపురుష్ ట్విట్టర్ టాక్ కొంత ఖేదం మరికొంత మోదం అన్నట్లుగా ఉంది. మొదటి నుండి బయపడుతున్నట్లే విజువల్స్ ఎఫెక్ట్స్ విషయంలో ఓం రౌత్ ఆకట్టుకోలేకపోయారు. ప్రభాస్ వంటి హీరో నటించిన భారీ బడ్జెట్ మూవీలో కార్టూన్ తరహా గ్రాఫిక్స్ ఉంటే ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమే. ఇక సీతగా కృతి సనన్ పర్లేదు అంటున్నారు. ఆదిపురుష్ మూవీపై భారీ హైప్ నెలకొంది. దీంతో మంచి ఓపెనింగ్స్ దక్కాయి. రెండో రోజు వచ్చే వసూళ్లను బట్టి ఆదిపురుష్ చిత్ర ఫలితం ఏమిటో తెలుస్తుంది…