నేషనల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా “ఏ- ఆది పురుష్”.అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ చిత్రబృందం సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ తాజాగా అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించారు.

ఒక విధంగా ఈ పాన్ ఇండియా సినిమాని వేగంగా పూర్తి చేసినట్టే. బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకి ప్రభాస్ గ్యాప్ లేకుండా డేట్స్ ఇచ్చాడు. హాలిడేస్ లో కూడా ప్రభాస్ ఈ సినిమా కోసం వర్క్ చేశాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. ప్రభాస్ సినీ కెరీర్ లోనే మొదటిసారి పౌరాణిక పాత్ర చేయబోతున్నాడు.
పైగా ఒక దేవుడి పాత్ర. అందుకే, ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే సీతగా కృతి సనోన్ నటిస్తోంది. భారీ తారాగణం.. మరోపక్క ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అన్నిటికీ మించి ఈ సినిమాలో స్పెషల్ మేకప్ మరియు వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ను వాడుతున్నారు.
ఈ క్రమంలోనే సైఫ్ అలీఖాన్ ముఖంలో చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. అందుకే బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తోంది. నిజానికి టీ సిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, ఒక సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.
మరోపక్క ప్రభాస్ కూడా తన మార్కెట్ కి తగ్గట్టుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు సెట్ చేసుకుంటూ నిజమైన పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాలో సీతగా కృతి సనోన్ నటిస్తోంది.
Rebel Star #Prabhas's #Adipurush [3D] Releasing Worldwide On 11th August, 2022 in Hindi, Telugu, Tamil, Kannada, Malayalam#Prabhas #SaifAliKhan @omraut @kritisanon @mesunnysingh #BhushanKumar @vfxwaala @rajeshnair06 @RETROPHILES1 @TSeries pic.twitter.com/oNws9sdLYd
— BA Raju's Team (@baraju_SuperHit) September 27, 2021