https://oktelugu.com/

Adipurush: ఆదిపురుష్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..టాక్ ఎలా ఉందంటే!

రామనామం తో భారతావని మరోసారి ప్రతిధ్వనిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 8, 2023 / 04:03 PM IST
    Follow us on

    Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , మలయాళం, హిందీ మరియు కన్నడ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసిన ఈ సినిమాకి సంబంధించిన పాటలే వినిపిస్తున్నాయి.

    రామనామం తో భారతావని మరోసారి ప్రతిధ్వనిస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి క్లీన్ U సర్టిఫికేట్ ని జారీ చేసారు. అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ సినిమాని చూడవచ్చు అని. ఈ చిత్రం నిడివి 2 గంటల 59 నిమిషాలట.

    రామాయణం ని మిగతా సినిమాలు లాగ కేవలం రెండు గంటల్లో చూపించడం చాలా కష్టం, ఈ సినిమాని డీటెయిల్ గా చూపించాలంటే కచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది. ఇది అందరూ ఊహించిందే, దానికి తగ్గట్టుగానే మూవీ టీం కూడా ఈ సినిమాని ఎడిట్ చేశారు. ఇక ఈ సినిమా మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ కూడా , బోర్ కొట్టిన అనుభూతి అసలు ఏమాత్రం కలగలేదట. స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా ఉంటూనే, చూడచక్కగా ఉండే విధంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారట.

    ముఖ్యంగా పాటలు వెండితెర మీద ఎంతో అద్భుతంగా తెరక్కేకిన్చారట. రాముడిగా ప్రభాస్, మరియు సీత గా కృతి సనన్ చాలా చాల చక్కగా నటించారని తెలుస్తుంది. ప్రభాస్ లుక్స్ ఒక్కటే సినిమాకి మైనస్ అట, దీనిని ఆడియన్స్ పట్టించుకోకపోతే సినిమా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.మరి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎలా తీసుకుంటారో తెలియాలంటే 16 వ తేదీ వరకు ఆగాల్సిందే.