https://oktelugu.com/

Adipurush Collections: ‘ఆదిపురుష్’ 3 వారాల వసూళ్లు..అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చిందిగా..ప్రభాస్ మాస్ అంటే ఇదే!

వీకెండ్స్ లో కూడా ఈ సినిమా పుంజుకోలేదు. దీనితో భారీ నష్టాలు తప్పవని బయ్యర్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆదిపురుష్ చిత్రానికి ఆ తర్వాత వసూళ్లు పూర్తిగా అయితే ఆగిపోలేదు. ప్రతీ రోజు ఎంతో కొంత షేర్ వసూళ్లను స్టడీ గా రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. దీని వల్ల వంద కోట్ల రూపాయిల నష్టం వస్తుంది అని భయపడిన బయ్యర్స్ కి చివరికి 40 కోట్ల నష్టాలను మిగిల్చే రేంజ్ కి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 4, 2023 / 10:36 AM IST

    Adipurush Collections

    Follow us on

    Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ రీసెంట్ గానే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. మొదటి మూడు రోజులు సుమారుగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో బయ్యర్స్ నిరాశకి గురయ్యే వసూళ్లను రాబట్టింది.

    వీకెండ్స్ లో కూడా ఈ సినిమా పుంజుకోలేదు. దీనితో భారీ నష్టాలు తప్పవని బయ్యర్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆదిపురుష్ చిత్రానికి ఆ తర్వాత వసూళ్లు పూర్తిగా అయితే ఆగిపోలేదు. ప్రతీ రోజు ఎంతో కొంత షేర్ వసూళ్లను స్టడీ గా రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. దీని వల్ల వంద కోట్ల రూపాయిల నష్టం వస్తుంది అని భయపడిన బయ్యర్స్ కి చివరికి 40 కోట్ల నష్టాలను మిగిల్చే రేంజ్ కి వచ్చింది.

    ఈ సినిమా ఇప్పుడు మూడు వారాలు పూర్తి చేసుకుంది, ఈ మూడు వారాలకు గాను అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి ఈ చిత్రం సుమారుగా 393 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. నిన్న కూడా కూడా ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 30 లక్షలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది . ఇది నిజంగా చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు అనే చెప్పొచ్చు. అసలు రెవిన్యూ రాకుండా ఆగిపోతుంది అనుకున్న సినిమా ఇంకా రన్ అవ్వడం కాస్త బయ్యర్స్ కి ఊపిరి పీల్చుకునేలా చేసింది.

    ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం లో ఈ చిత్రానికి కరీంనగర్ లాంటి టౌన్స్ లో ఇప్పటికీ వసూళ్లు వస్తూనే ఉన్నాయి.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 242 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 192 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయిలు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.