Serial Heroines Remuneration: సినిమా హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్స్ అందుకుంటున్న సీరియల్ హీరోయిన్లు వీళ్ళే..!

'చంటిగాడు' అనే సినిమా ద్వారా ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది, ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఈమెకి ఎందుకో ఆశించిన స్థాయిలో సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సీరియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ అయినా సుహాసిని తన ఒక్క రోజు కాల్ షీట్ కోసం 20 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది.

Written By: Vicky, Updated On : July 4, 2023 4:01 pm

Serial Heroines Remuneration

Follow us on

Serial Heroines Remuneration: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకి కోటి నుండి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మరీ డిమాండ్ ఎక్కువ ఉంటె పది కోట్లు కూడా దాటి ఉంటుంది. రీసెంట్ గా నిన్న గాక మొన్న వచ్చిన హీరోయిన్ శ్రీలీల కూడా ఒక్కో సినిమాకి 3 నుండి 5 కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని రాబడుతుంది. కేవలం సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు , కొంతమంది సీరియల్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యూనరేషన్ , మరియు వాళ్ళ సంపాదన చూస్తే మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏమాత్రం సరిపోరు అని అర్థం అవుతుంది.అలా అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సీరియల్ హీరోయిన్స్ లిస్ట్ ఒకసారి చూద్దాము.

సుహాసిని :

‘చంటిగాడు’ అనే సినిమా ద్వారా ఈమె టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది, ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ కూడా ఈమెకి ఎందుకో ఆశించిన స్థాయిలో సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సీరియల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఆడియన్స్ కి మరింత చేరువ అయినా సుహాసిని తన ఒక్క రోజు కాల్ షీట్ కోసం 20 వేల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటుంది.

ఐశ్వర్య :

ఈమె కూడా బుల్లితెర మీద స్టార్ హీరోయిన్ రేంజ్ అన్నమాట, కస్తూరి సీరియల్ ద్వారా ఫేమస్ అయినా ఐశ్వర్య కి ఒక్క రోజు కాల్ షీట్ ఇచ్చినందుకు గాను 20 వేల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంటే నెలకు ఆరు లక్షల రూపాయిలు అన్నమాట. మన డైలీ సీరియల్స్ సంవత్సరాల తరబడి టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. దీనిని బట్టీ ఈమె సంపాదన ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

నవ్య స్వామి :

ఈమె ఈటీవీ , మాటీవీ, జీటీవీ లలో ఎన్నో సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. ఈమెకి సోషల్ మీడియా లో యూత్ లో ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు, ఈమె ఒక్క రోజు కాల్ షీట్ కోసం 35 వేల రూపాయిలు అందుకుంటుంది .అంటే నెలకు 10 లక్షల రూపాయలకు పైగానే సంపాదిస్తుంది అన్నమాట.

పల్లవి రామిశెట్టి :

బుల్లితెర పై సంసార పక్షమైన పాత్రలు చేస్తూ మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న పల్లవి రామిశెట్టి, ఒక్క రోజుకి గాను 15 రూపాయిలు అందుకుంటుంది, అంటే నెలకు 4 లక్షల 50 వేల రూపాయిలు అన్నమాట.

ప్రేమి విశ్వనాధ్ :

‘కార్తీక దీపం’ లాంటి మెగా బ్లాక్ బస్టర్ సీరియల్ లో వంటలక్క గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రేమి విశ్వనాధ్ ఒక్క రోజు కాల్ షీట్ కోసం 50 వేల రూపాయిలు అందుకుంటుంది అట. అంటే నెలకు 15 లక్షల రూపాయిలకు అన్నమాట, ప్రస్తుతం ఈమె అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ .ఇక హరిత మరియు ఆషిక వంటి వారు ఒక్క రోజు 15 నుండి 20 వేల రూపాయిలు అందుకుంటున్నారు.