Prabhas: బాహూబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలకే ఓటేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ 25వ సినిమా గురించి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా ఖాయం చేసిన విషయం తెలిసిందే . ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఇందులో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

అయితే, ముందుగా ఈ సినిమా కథను మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లకు వినిపించారట సందీప్. అయితే, రామ్ చరణ్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని కోరాడట. సందీప్ దానికి నిరాకరించినట్లు సమాచారం. తర్వాత ఈ కథను ప్రభాస్‌కు చెప్పగా ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే అనేశాడట. భారీ స్థాయిలో తెరక్కిస్తున్న ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్‌తో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.