Prabhas Photos Leaked: సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో అత్యంత ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ పొందుతున్న హీరోల్లో ప్రభాస్ ఒకరు.ఈయన మిర్చి సినిమా వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.ఇక ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. బాహుబలి సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయి మంచి గుర్తింపు సాధించుకుంటుంది.
ఇక అందులో భాగంగానే ఆయన మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా రాజా డీలక్స్ అనే పేరును పెట్టడం జరిగింది.ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో సాగుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు సంబంధించిన లుక్స్ లీక్ అయ్యాయి ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.నిజానికి ఈ లుక్ ని సినిమా యూనిట్ అక్టోబర్ 23 కి రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు కానీ అలోపే లీక్ అయింది. ఆ లీకైన లుక్ చూస్తుంటే మిర్చి సినిమాలో ప్రభాస్ ని చూసినట్టుగా అనిపిస్తుంది. నిజంగా వింటేజ్ లుక్ తో ప్రభాస్ ఒక పది సంవత్సరాలు క్రితం ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తున్నారు. ఈ లీకైన పిక్ ని చూసిన ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఎందుకంటే బహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఫిజికల్ గా షెప్ అవుట్ అయిపోయారు దాంతో ప్రభాస్ లుక్స్ చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా మారాయి కానీ సలార్ లో మాత్రం ఉర మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కూడా చాలా బ్రైట్ గా,క్యూట్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాలను కనుక చూసుకుంటే ఈ సినిమా కోసం ప్రభాస్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అని తెలుస్తుంది. లాభాల్లో నుంచి ఎంతో కొంత వాటా తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమా ఎక్కువ భాగం ఒక ఇంటి లో జరుగుతుండడంతో ఆ ఇల్లుకు సంబంధించిన సెట్ అనేది వేయడం జరిగింది. ఆ సెట్ కోసం దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నాడు.ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసిన సలార్ సినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవ్వడం వల్ల ఈ సినిమా లేట్ అయింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డిసెంబర్ 22 కు వెళ్ళిపోయింది. దాంతో ప్రభాస్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందినట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు వచ్చిన అదిపురుష్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేదు. దాంతో ప్రభాస్ అభిమానులు మొత్తం సలార్ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని కోరుకుంటున్నారు.
ఇక ఈ క్రమంలో ప్రభాస్ మారుతీ లాంటి ఒక బి గ్రేడ్ డైరెక్టర్ తో సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు అని కొంతమంది ప్రభాస్ మీద నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పటికీ ఒకసారి ప్రభాస్ మూవీస్ లైనప్ కనక చూసుకుంటే మొత్తం భారీ సినిమాలే ఉన్నాయి. కాబట్టి ఎంటర్ టైనర్ ఒకటైన చేయాలనే ఉద్దేశంతో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికే ఈ సినిమా 60% షూటింగ్ పూర్తి చేసుకుని మిగతాది కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్ …