https://oktelugu.com/

తెలుగు హీరోల్లో పవర్ స్టారే.. టాప్!

దేశంలో ఏ సినిమా ఇండ‌స్ట్రీలో లేని వ్య‌వ‌హారాలు టాలీవుడ్లో కొన‌సాగుతుంటాయి. అస‌లు.. క‌థానాయ‌కుడి ప‌ని న‌టించి వెళ్లిపోవ‌డం. ద‌ర్శ‌కుడి ప‌ని క‌థ‌నం చూసుకోవ‌డం.. ప్రొడ్యూస‌ర్ ప‌ని నిర్మాణ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డం. కానీ.. కొంద‌రు టాప్ స్టార్లు.. వీట‌న్నింట్లో వేలు పెట్టేస్తార‌నే టాక్ గ‌ట్టిగానే ఉంది. మ‌రికొంద‌రైతే కాళ్లు కూడా పెట్టేస్తార‌ని అంటుంటారు. హీరోయిన్ల‌ను ఎవ‌రిని తీసుకోవాలి? ఏయే లొకేష‌న్ల‌లో సీన్లు తీయాలి? ఎక్క‌డ పాట‌లు షూట్ చేయాలి? అనే విష‌యాలు మొద‌లు.. ఎలాంటి ఫైట్లు పెట్టాలి? క్యారెక్టర్ […]

Written By:
  • Rocky
  • , Updated On : May 3, 2021 / 03:52 PM IST
    Follow us on

    దేశంలో ఏ సినిమా ఇండ‌స్ట్రీలో లేని వ్య‌వ‌హారాలు టాలీవుడ్లో కొన‌సాగుతుంటాయి. అస‌లు.. క‌థానాయ‌కుడి ప‌ని న‌టించి వెళ్లిపోవ‌డం. ద‌ర్శ‌కుడి ప‌ని క‌థ‌నం చూసుకోవ‌డం.. ప్రొడ్యూస‌ర్ ప‌ని నిర్మాణ వ్య‌వ‌హారాలు చూసుకోవ‌డం. కానీ.. కొంద‌రు టాప్ స్టార్లు.. వీట‌న్నింట్లో వేలు పెట్టేస్తార‌నే టాక్ గ‌ట్టిగానే ఉంది. మ‌రికొంద‌రైతే కాళ్లు కూడా పెట్టేస్తార‌ని అంటుంటారు.

    హీరోయిన్ల‌ను ఎవ‌రిని తీసుకోవాలి? ఏయే లొకేష‌న్ల‌లో సీన్లు తీయాలి? ఎక్క‌డ పాట‌లు షూట్ చేయాలి? అనే విష‌యాలు మొద‌లు.. ఎలాంటి ఫైట్లు పెట్టాలి? క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎవరిని తీసుకోవాలి? అంటూ ఓ లిస్టునే ప్రిపేర్ చేస్తుంటార‌ట‌. తాము రిక‌మండ్ చేసిన వాటిల్లో ఏది కాద‌న్నా.. అలుగుతుంటార‌ట‌.

    కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం అల‌గ్‌. త‌న ప‌ని ఏంట‌న్న‌ది మాత్ర‌మే చూసుకుని వెళ్తారు. వ‌కీల్ సాబ్ సినిమానే తీసుకుంటే.. అందులో గ‌న‌క వేరే హీరో న‌టించి ఉంటే నిర్మాత‌కు చాలా తంటాలు వ‌చ్చేవి ఉండేవ‌న్న‌ది టాక్‌. ఆ సినిమాలోని ముగ్గురు హీరోయిన్ల‌లో ఎవ‌రిని తీసుకుంటున్నార‌నేది ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదట‌. అంతేకాదు.. కోర్టు రూమ్ క్వాలిటీ కూడా ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌.

    ఇంకా.. లొకేష‌న్లు, ఇత‌రత్రా విష‌యాల మీద కూడా ప‌వ‌న్ డిమాండ్లు ఏమీ పెట్ట‌లేదట‌. దీనివ‌ల్ల నిర్మాత దిల్ రాజుకు కొన్ని కోట్ల రూపాయ‌లు మిగిలాయ‌న్న‌ది టాక్. ఈ విధంగా ప‌వ‌న్‌ నిర్మాత‌ల హీరో అన్న‌ది ఇండ‌స్ట్రీ టాక్‌. నిజానికి నిర్మాత బాగుంటేనే ఇండ‌స్ట్రీ బాగుంటుంది. కాబ‌ట్టి.. ఆయ‌న‌కు ఓ రూపాయి మిగిలే ప‌నులు చేయ‌డం హీరో ధ‌ర్మం కూడా. ఆ విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ టాలీవుడ్లోనే టాప్ స్టార్ అంటున్నారు.