Lokesh Kanakaraj- Pawan Kalyan: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఉన్నంత బిజీ గా మరో స్టార్ హీరో లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ‘బ్రో’ అనే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా, #OG మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలతో పాటుగా ఆయన హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు.
‘హరి హర వీరమల్లు’ చిత్రం కూడా 90 శాతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన షూటింగ్ ఒక్కటే బ్యాలన్స్ ఉంది, ఈ షూటింగ్ కోసం వచ్చే నెల నుండి డేట్స్ కేటాయించాడు పవన్ కళ్యాణ్. వీటితో పాటు పవన్ కళ్యాణ్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఊపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ త్వరలోనే సన్ పిక్చర్స్ తో తెలుగు లో ఒక సినిమా చేయబోతుంది.
మొదటి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చెయ్యబోతునట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ #OG మూవీ సెట్స్ కి విచ్చేసిన సన్ పిక్చర్స్ సంస్థ వైస్ చైర్మన్, పవన్ కళ్యాణ్ తో కాసేపు చర్చలు జరిపిందట. ఆ చర్చలు కొత్త సినిమాకి సంబంధించినదే అని తెలుస్తుంది.
‘మాస్టర్’, ‘ఖైదీ’ మరియు ‘విక్రమ్’ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో చెడుగుడు ఆదుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం లోకేష్ తమిళ స్టార్ హీరో విజయ్ తో ‘లియో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అవ్వగానే రజినీకాంత్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాతే పవన్ కళ్యాణ్ – లోకేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని సమాచారం.