Pawan Kalyan Instagram: సోషల్ మీడియా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హవా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డామినేషన్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ వంటి అప్లికేషన్స్ లో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టాడు. ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ లేనప్పుడు , ఆయన పేరు మీద ఉన్న హ్యాష్ ట్యాగ్ మీద అత్యధిక పోస్టులు కలిగియున్న ఏకైక టాలీవుడ్ హీరో గా పవన్ కళ్యాణ్ నిలిచాడు.
ఇక రెండు గంటల క్రితం ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కి ఫాలోయర్స్ తండోపతండాలుగా వస్తున్నారు. అకౌంట్ ని క్రియేట్ చేసిన గంట వ్యవధిలోనే రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఆ తర్వాత రెండు గంటల వ్యవధి లో 5 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చారు.
ఇది సౌత్ ఇండియా లోనే ఆల్ టైం టాప్ 2 ఫాస్టెస్ట్ ఫాలోయర్స్ ని అందుకున్న అకౌంట్ గా నిల్చింది. మొదటి స్థానం లో తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ని ప్రారంభించిన 99 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. ఆ తర్వాతి స్థానం పవన్ కళ్యాణ్ అకౌంట్ నిల్చింది. అయితే పవన్ కళ్యాణ్ అకౌంట్ కి వస్తున్న ఫాలోయర్స్ మొత్తం జెన్యూన్ గా వచ్చినవి అని.
విజయ్ కి ఎక్కువగా బాట్స్ ఉంటాయని, కాబట్టి పవన్ కళ్యాణ్ రికార్డు పటిష్టమైనదని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ప్రభాస్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ వీళ్ళందరికీ ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ మార్కుకి చేరుకోవడానికి రోజుల సమయం పట్టింది. కానీ పవన్ కళ్యాణ్ కి కేవలం గంటల సమయం మాత్రమే పడుతుంది. చూడాలి మరి 24 గంటల్లో ఆయనకీ ఎంతమంది ఫాలోవర్స్ రాబోతున్నారు అనేది.