
సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీలు తీసిన జోడి నందమూరి బాలక్రిష్ణ-బోయపాటి శ్రీనులు.. ఈ ఇద్దరి ద్వయం ముచ్చటగా మూడోసారి కలిసి తీస్తున్న సినిమా ‘అఖండ’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ లుక్ లకు అదిరిపోయేలా స్పందన వచ్చింది. సినిమా అంచనాలు మించేలా కనిపించింది.
ప్రధానంగా ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఓ రేంజ్ లో ప్లాన్ చేశాడట దర్శకుడు బోయపాటి శ్రీను. హీరో ఎలివేషన్ సీన్లు ఓ రేంజ్ లో వచ్చాయట.. అఖండలో యాక్షన్ అదిరిపోతుందట.. ఇప్పటికే ఈ సినిమా కోసం రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ లు డేట్స్ కేటాయించినా సరిపోకపోవడంతో కొత్త ఫైట్ మాస్టర్ ను తీసుకొచ్చారట.. స్టన్ శివ ఆధ్వర్యంలో ఏకంగా 80 రోజుల పాటు కేవలం యాక్షన్ సన్నివేశాలే తీశారట..
తాజాగా ‘అఖండ’ సినిమా పూర్తయ్యిందని.. యాక్షన్ సీన్ల కోసమే ఏకంగా 80 రోజుల పాటు షూటింగ్ చేశామని ఫైట్ మాస్టర్ స్టన్ శివ ట్వీట్ చేశాడు. అఖండ షూటింగ్ పూర్తయ్యిందని.. ఒక కుటుంబం లాగా ఇది సాగిందని.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, మిగతా యాక్షన్ సన్నివేశాల కోసమే ఏకంగా 80 రోజులకు పైగా పట్టిందని స్టన్ శివ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఈ మేరకు సెట్ లో వర్షంలో తడుస్తూ దర్శకుడు బోయపాటి శీనుతోపాటు ఫైట్ మాస్టర్లతో తాను దిగిన ఫొటోను స్టన్ శివ షేర్ చేశాడు. ఈ సినిమా యాక్షన్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయని శివ చెబుతున్నాడు.దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ‘బాలయ్య-బోయపాటి’ మూవీ మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు.