Rhea Chakraborty: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై విచారణలో భాగంగా ‘రియా చక్రవర్తి’ మొత్తం ఇండియా వైడ్ గా అనేక రకాలుగా వార్తల్లో నిలిచింది. పైగా ఎన్నో అనుమానాలు, మరెన్నో అపవాదులు.. చివరకు జైలు జీవితం కూడా అనుభవించింది. అలాగే డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కుంది. ఇక బెయిల్ పై బైటికి వచ్చాకా, కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదు ‘రియా చక్రవర్తి’. కేవలం, ఇంట్లోనే కూర్చుని తన పై వచ్చిన కథనాలను చదువుకుంటూ టైం పాస్ చేసింది.
Rhea Chakraborty :
అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రవర్తి పాత్ర ఉందని కొందరి వాదన. పైగా పోలీసులు కూడా ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో డ్రగ్స్ కోణంపై ఆమెను పోలీసులు సుదీర్ఘ విచారణ జరిపారు కూడా. కాగా సుశాంత్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ లో రియా, సుశాంత్ కలిసి ఉన్న ఒక పాత వీడియోని పోస్ట్ చేసింది. పైగా ‘మిస్ యూ సో మచ్’ అంటూ చిన్న మెసేజ్ కూడా పెట్టింది.
Also Read: పవన్ కోసం అద్భుతమైన సెట్స్.. అదే ప్రత్యేక ఆకర్షణ !
అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు రియాని బూతులు తిడుతున్నారు. మంచి హీరో, ఎంతో భవిష్యత్తు ఉన్న వ్యక్తి జీవితంలోకి వెళ్ళావ్, చివరకు ఆ వ్యక్తిని లేకుండా చేశావు’ అంటూ ఒకరు, నువ్వు అసలు మనిషివేనా ? అంటూ మరొకరు.. ఇక ఇంకో నెటిజన్ ఐతే, రాయలేని విధంగా బూతులు తిట్టాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ తో ఉన్న వీడియోని పోస్ట్ చేసి..రియా బాగా బూతులు తిట్టించుకుంది.
Also Read: టీ20 వరల్డ్ కప్ -2022 షెడ్యూల్ రిలీజ్.. భారత్, పాక్ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..?