Kiara Advani: హీరోయిన్ కియారా అద్వానీ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో భూకంపం రేపింది. ఆమె టెంప్టింగ్ హాట్ ఫోజులు కుర్రాళ్ళ గుండెల్లో గుబులురేపుతున్నాయి. ఆమె అందాలు కునుకు లేకుండా చేస్తుండగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కియారా అద్వానీ తెలుగులో రెండు చిత్రాలు చేశారు. దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఆ చిత్రంలో మహేష్ బాబు-కియారా కెమిస్ట్రీ అదిరింది. మూవీ సూపర్ హిట్ కొట్టింది.
అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను రామ్ చరణ్ కి జంటగా తీసుకున్నాడు. వినయ విధేయ రామ చిత్రంలో ఆమె గ్లామర్ హైలెట్ అయ్యింది. సినిమా మాత్రం నిరాశపరిచింది. దీంతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. అదే సమయంలో అమ్మడు బాలీవుడ్ లో బిజీ అయ్యింది. చాలా గ్యాప్ అనంతరం కియారా తిరిగి తెలుగు మూవీ చేస్తున్నారు. ఈసారి ఆమెకు భారీ పాన్ ఇండియా ఆఫర్ దక్కింది. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ తో రెండోసారి జతకడుతుంది.
దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ ఎపిసోడ్స్ లో ఆయన రాజకీయ నాయకుడు. ఈ పాత్రకు అంజలి హీరోయిన్. ఎలక్షన్ అధికారిగా మరో రోల్ చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ మూవీ నత్త నడక సాగుతుంది. శంకర్ ఒకేసారి భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ తెరకెక్కించడం సమస్యగా మారింది. లేదంటే 2024 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ విడుదల కావాల్సింది.
కాగా ఈ ఏడాది కియారా వివాహం చేసుకున్న విషయం తెలిసింది. కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కియారా డేటింగ్ చేస్తున్న కియారా పెళ్లి పీటలెక్కింది. రాజస్థాన్ లో బంధుమిత్రుల నడుమ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. అనంతరం ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా కియారా పెళ్ళికి ముందే గర్భవతి అయ్యారనే ప్రచారం జరిగింది. అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. అవన్నీ పుకార్లే అని తేలిపోయింది.