Posani Krishna Murali : ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత, ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)|, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతన్ని అరెస్ట్ చేసి PT వారెంట్ క్రింద ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ కి తిప్పుతున్న సంగతి తెలిసిందే. నేడు కూడా ఆయన్ని CBI కస్టడీ లోకి తీసుకొని విచారిస్తుంది. ఇది ఇలా ఉండగా పోసాని పై ఇప్పుడు మరో సరికొత్త ఆరోపణ వెలుగులోకి వచ్చింది. FD చైర్మన్ గా ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి, అదే విధంగా అతని సిబ్బంది మహేష్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 9 లక్షల రూపాయిలు తీసుకున్నారని, కానీ అ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతానికి చెందిన సత్యనారాయణశెట్టి ఆరోపించాడు.
Also Read : సిఐడి కస్టడీకి పోసాని.. సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదన
హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ మురళి పై గతం లో కేసు వేశానని,కానీ ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. ఈమేరకు ఆయన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయం కి చేరుకొని ఫిర్యాదు చేసారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురు మూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఇలాంటి బాధితులు అందించే వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పోసాని కృష్ణ మురళి ప్రస్తుతం గుంటూరు లో ఈ నెల 26 వరకు రిమాండ్ లో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ పూర్తి అయిన వెంటనే ఈ కేసులో ఇరికించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూస్తుంటే ఆయన ఇప్పట్లో జైలు నుండి బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
ఇదంతా పక్కన పెడితే నేడు CBI విచారణకు హాజరైన పోసాని కృష్ణ మురళి, అనేక సంచలన నిజాలను బయటపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తనతో అలా బూతులు తిట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారని, అందుకు డబ్బులు కూడా ఇచ్చారని ఈ విచారణ పోసాని చెప్పుకొచ్చాడట. అంతే కాకుండా పలు సంచలన నిజాలను కూడా ఆయన పెట్టినట్టు తెలుస్తుంది. ఇంతకు ఏమిటి ఆ నిజాలు అనేది ఇంకా బయటకు రాలేదు కానీ, నేడు CBI విచారణలో వెలువడిన నిజాలు పలు సంచలన అరెస్టులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ రెడ్డి, అతని కుమారుడు సజ్జల భార్గవ్ ఈ వ్యవహారం లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : ఆ బాధ అందరిదీ.. పోసాని కృష్ణమురళి తీరు గుణపాఠమే!