Homeఎంటర్టైన్మెంట్Posani Krishna Murali viral video: పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే భయపడి దండం పెట్టిన...

Posani Krishna Murali viral video: పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే భయపడి దండం పెట్టిన పోసాని కృష్ణ మురళి.. వీడియో వైరల్..

Posani Krishna Murali viral video: 2019 నుండి 2024 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యక్తుల్లో ఒకరు పోసాని కృష్ణ మురళి. వైసీపీ పార్టీ లో చేరిన ఆయన పలు కీలక బాధ్యతలు కూడా చేపట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క వైసీపీ పార్టీ లో యాక్టీవ్ గా ఉంటూ , ప్రత్యర్థులపై తీవ్రమైన విమర్శలు చేస్తుండేవాడు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ లపై పోసాని కృష్ణ మురళి ఏ స్థాయిలో విమర్శించేవాడో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని అయితే ‘ల’ కారాలతో తిట్టి, చివరికి పవన్ కళ్యాణ్ చిన్న కూతురిపై కూడా అత్యంత నీచంగా తిట్టాడు. ఆ స్థాయిలో రెచ్చిపోయిన పోసాని పై అప్పట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి కూడా చేయబోయారు.

కానీ అధికార వైసీపీ పార్టీ లో ఉండడం వల్ల, జగన్ అండతో స్వేచ్ఛగా తిరిగేవాడు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందో, అప్పటి నుండి పోసాని కృష్ణమురళి కి బ్యాడ్ డేస్ మొదలయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేసి ఎన్ని జైళ్లకు తిప్పారో మన అందరికీ తెలిసిందే. అయ్యో పాపం అన్న వాళ్ళు కూడా లేరు , అతను చేసిన కామెంట్స్ కి ఆ మాత్రం శిక్ష పడాలి అనే అంతా అనుకున్నారు. ఇక జైలు నుండి విడుదల అయ్యాక , వైసీపీ పార్టీ కి దూరమై , రాజకీయాలపై నోరు మెదపకుండా , చాలా సైలెంట్ గా ఇన్ని రోజులు ఉంటూ వచ్చాడు. అయితే నేడు ఆయన చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , నిర్మాత , హీరో అన్ని ఆయనే.

ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఒక మీడియా రిపోర్టర్ పవన్ కళ్యాణ్ , చంద్రబాబు పాలనపై ప్రశ్నలు అడగ్గా , పోసాని కృష్ణ మురళి సమాధానం చెప్తూ ‘నాకు రాజకీయాలకు సంబంధమే లేదు , చాలా కాలం తర్వాత సినిమా చేసుకుంటున్నాను అబ్బా , నన్ను రోడ్డు మీద పడేయకండి అబ్బా’ అంటూ దండం పెడుతాడు. ప్రజాసేవ చెయ్యాలంటే రాజకీయాల గురించి మాట్లాడాలి కదా సార్ అని రిపోర్టర్ అడగ్గా, ‘హా ప్రజాసేవ ఉండాలంటే సేవ చెయ్యాలి, జైలుకు వెళ్ళాలి, తప్పే లేదు , మీకు తెలుసు కదా’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular