Homeఎంటర్టైన్మెంట్Por Thozhil Review: "పోర్ టోళిల్" సినిమా రివ్యూ

Por Thozhil Review: “పోర్ టోళిల్” సినిమా రివ్యూ

టైటిల్: పోర్ తోళిల్
నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల, శరత్ బాబు, తదితరులు.

నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెహగల్, ముఖేష్ మెహతా, సివి శరత్, పూనమ్ మెహ్రా, సందీప్ మెహ్రా.
దర్శకుడు: విగ్నేష్ రాజా
సంగీతం: బెక్స్ బీజోయ్
ఎడిటర్: శ్రీజిత్ సరంగ్
సినిమాటోగ్రఫీ: కాలై సెల్వన్ శివాజీ
స్ట్రీమింగ్: సోనీ లివ్(ఆగస్టు 11 శుక్రవారం నుంచి)

ఓకె తెలుగు రేటింగ్: 3/5

కోవిడ్ తర్వాత ప్రేక్షకులు సినిమాను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో పెద్దపెద్ద అంచనాల నడుమ విడుదలైన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా చతికిల పడుతున్నాయి.. ఇదే సమయంలో ఎంగేజింగ్ కథ, కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే, థ్రిల్లర్ కదా నేపథ్యంలో రూపొందిన సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఇటువంటి సినిమాలకే ప్రస్తుతం మార్కెట్లో ఆదరణ ఉంది. సరిగా రెండు సంవత్సరాల క్రితం విడుదలైన తమిళ రాక్షసన్ ఎంతటి గొప్ప థ్రిల్లర్ సినిమాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. తెలుగులోనూ రీమేక్ అయిన ఆ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు తొలి హిట్ అందించింది. ఆ సినిమా తర్వాత తమిళంలో ఆ స్థాయి థ్రిల్లర్ రాలేదు అని చెప్పాలి. అయితే తాజాగా సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ” పోర్ తోళిల్” క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తమిళంలో విడుదలైన ఈ సినిమా కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాల్లో ది బెస్ట్ గా నిలిచింది. శుక్రవారం నుంచి సోనీ లివ్ లో ఈ సినిమాకు సంబంధించి తెలుగు వర్షన్ స్ట్రీమ్ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ

తమిళనాడులోని క్రైమ్ బ్రాంచ్లో ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్) అనే అధికారి పనిచేస్తుంటాడు. ఇతడు డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇతడి దగ్గర ట్రైన్ డీఎస్పీ అధికారిగా పనిచేసేందుకు ప్రకాష్( అశోక్ సెల్వన్) అనే అధికారి వస్తాడు.. ఎస్పీ లోకనాథన్ దగ్గర టెక్నికల్ అసిస్టెంట్ గా వీణ(నిఖిలా విమల) కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే తిరుచ్చిలో జరిగిన ఒక హత్య కేసు విచారణ బాధ్యత వీరి ముగ్గురు మీద పడుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరిన్ని వరస హత్యలు జరుగుతుంటాయి. మరి ఈ పరంపరలో హత్యలు చేస్తున్న నిందితుడిని వాళ్లు పట్టుకున్నారా? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే?

సాధారణంగా థ్రిల్లర్, క్రైమ్ సినిమాల్లో రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వీటి ఆధారంగానే దర్శకులు క్రైమ్ సినిమాలను తీస్తుంటారు. “పోర్ తోళిల్”సినిమా విషయంలోనూ దర్శకుడు అదే పంథా కొనసాగించాడు. అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ లు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో దర్శకుడు కథను ప్రేక్షకులకు అర్థమయ్యేలాగానే రాసుకున్నాడు. రాత్రిపూట గస్తీ కాస్తున్న పోలీసులకు ఒక చోట యువతి మృతదేహం కనిపిస్తుంది. ఆ తర్వాత దర్శకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా కథలోకి తీసుకెళ్లిపోతాడు. ఎస్పీ, ట్రైనీ డీఎస్పీ, టెక్నికల్ అసిస్టెంట్ పాత్రలను పరిచయం చేసుకుంటూ వెళ్తాడు. పరస్పర విరుద్ధమైన మనస్తత్వాలు ఉండే ఎస్పి, ట్రైనీ డిఎస్పి.. ఆ యువతి మర్డర్ కేసు దర్యాప్తు చేయడం, ఈ క్రమంలో వాళ్లకు ఒక్కొక్కటిగా ఆధారాలు లభించడంతో స్టోరీ ప్రేక్షకుడు ఊహించిన విధంగానే పరుగులు పెడుతుంది.. ఇంటర్వెల్ వరకు దర్శకుడు ఇదే టెంపో కంటిన్యూ చేశాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం దీనిని మరింత హై స్పీడ్ కు తీసుకెళ్లాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ముగించాడు. దీంతో ప్రేక్షకులు సీటు ఎడ్జ్ లో కూర్చోవడం ఖాయం.

ఎస్పీ లోకనాథన్, ట్రైని డిఎస్పి ప్రకాష్.. మర్డర్ కేసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే గురుస హత్యలు జరుగుతుంటాయి. ఇక్కడ దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు మొత్తం సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఫీల్డ్ ట్రైనింగ్, హత్య ఎలా జరిగిందో వివరించడం లాంటి సన్నివేశాలు చూస్తుంటే మనం అక్కడే ఉన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో ప్రకాష్ తన అమాయకత్వంతో చేసే సింపుల్ కామెడీ మనల్ని నవ్విస్తుంది.. ఇక ఈ సన్నివేశాలను మొత్తం క్లైమాక్స్ కు లింక్ చేసిన విధానం సూపర్బ్ అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకుడి బ్రిలియంట్ రైటింగ్ ని మనం మెచ్చుకోకుండా ఉండలేం. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ లా కాకుండా చివరిలో మెసేజ్ ఇవ్వడం రాక్షసన్ సినిమాను గుర్తుకు తెస్తుంది. అయితే మనుషులు ఆ ఒక్క విషయం వల్ల సైకో లుగా మారుతారా? అనే సందేహం వస్తుంది.

ఎలా చేశారంటే..

ఈ సినిమాను తక్కువ పాత్రలతో దర్శకుడు తీశాడు. అయితే ప్రతి పాత్రను కూడా సమర్థవంతంగా వాడుకున్నాడు. ఎస్పీ లోకనాథన్ గా శరత్ కుమార్, ట్రైనీ డిఎస్పీగా అశోక్ సెల్వన్ తమ పాత్రల్లో మెప్పిస్తారు. ట్రైనీ డిఎస్పీ ప్రకాష్ మొదట భయస్తుడిగా కనిపిస్తాడు. ఈ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. క్లైమాక్స్ లో ఈ పాత్ర తీరు మారుతుంది. వీణ గా నిఖిలా విమల్ బాగా చేసింది. మొదట్లో ఈ పాత్ర సో సో గా ఉంటుంది. క్లైమాక్స్ల్ లో గాని ఈ పాత్రకి ఉన్న ప్రాముఖ్యం ఏమిటో అర్థం కాదు. కెన్నడిగా దివంగత శరత్ బాబు రోల్ షాక్ కు గురిచేస్తుంది. మిగతా నటులు వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతికపరంగా..

సాంకేతికపరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది.. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. రైటర్ ఆల్ఫ్రైడ్ ప్రకాష్, దర్శకుడు విగ్నేష్ రాజా కలిసి మంచి క్రైమ్ థ్రిల్లర్ కథను ప్రేక్షకులు అందించారు.. ఈ సినిమాలో లవ్ ట్రాక్ జోలికి పోకుండా దర్శకుడు మంచి పని చేశాడు. చివరిలో ఈ సినిమాకు సీక్వెల్ ఉందని దర్శకుడు హింట్ ఇచ్చాడు. ఓవరాల్ గా రాక్షసన్ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకులను సీటు చివరి ఎడ్జ్లో కూర్చోబెట్టే సినిమా ఇది.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular