Thank You For Coming: భూమి పెడ్నేకర్ లేటెస్ట్ మూవీ థాంక్యూ ఫర్ కమింగ్ ఎంతో కొలహలమైనటువంటి కామెడీ మూవీ. ఏక్తా కపూర్, రియా కపూర్ ఇంతకుముందు మల్టీ స్టార్ గా చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ వీరే ది వెడ్డింగ్ లాగా తిరిగి ఇప్పుడు థాంక్యూ ఫర్ కమింగ్ అన్న ఏజ్ ఓల్డ్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ కు రియా భర్త కరణ్ బూలానీ డైరెక్షన్ వహించారు.ఈ మూవీ లో కపిల, డాలీ సింగ్, షిబానీ బేడీ కూడా నటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న
థ్యాంక్యూ ఫర్ కమింగ్ కూల్ చిక్స్ మూవీ కి రైజ్, రెబెల్, రిపీట్ అనే ట్యాగ్‌లైన్ మూవీ పై హైప్ ఇంకా పెంచింది. ఈ మూవీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) 2023లో ప్రదర్శించనున్నారు.
నిర్మాత రియా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ మూవీ కి సంబందించిన పోస్టర్ తో పాటు గా మూవీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.రియా షేర్ చేసిన ఈ పోస్టర్ లో భూమి గోల్డెన్ లెహంగాలో మాంచి చిల్ మోడ్ లో కనిపిస్తుంది.మిగిలిన అమ్మాయిలు కూడా ఏదో మాంచి మరేజ్ ఫంక్షన్ కు రెడీ అయినట్లు కనిపిస్తున్నారు.అదే సమయంలో వాలు చాలా ఫన్నీ,డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తారు. అలాగే ఆమె షేర్ చేసిన ఇంకో పిక్ లో అందరూ అమ్మాయిలు వేర్వేరు దుస్తులలో ఒకరికొకరు అప్పోసిట్ గా కూర్చున్నట్లు ఉన్నారు
రియా ముచ్చటగా షేర్ చేసిన మూడవ పోస్టర్ లో టేబుల్ చుట్టూ కూర్చున్న అమ్మాయిలు తమ ముందు టేబుల్ పై చిందిన వైన్ వైపు షాక్ గా చూస్తుంటారు.దీనికి క్యాప్షన్ గా “టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో మా మూవీ ఎంపిక కావడం మాకు గౌరవంగా ఉంది!! మా గాలా ప్రీమియర్‌లో కలుద్దాం!” అని రాశారు. ఏడాది ఇంటర్నేషనల్ గాలాలో ప్రదర్శింపబోతున్న ఏకైక హిందీ చిత్రంగా ఈ మూవీ మూవీ నిలుస్తుంది. సెప్టెంబర్ 15 2023, రాయ్ థాంసన్ హోటల్ లో నిర్వహిస్తున్న టొరెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్ట్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతుంది.