spot_img
Homeఎంటర్టైన్మెంట్Heroine Poorna: పూర్ణ ఆ విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది

Heroine Poorna: పూర్ణ ఆ విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది

Heroine Poorna: హీరోయిన్ పూర్ణకి కాలం కలిసి రావడం లేదు. ఆమెకు అందం ఉంది, అభినయం ఉంది, కానీ ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. నిజానికి ‘అఖండ’తో ఈ హోమ్లీ బ్యూటీకి ఘన విజయం వచ్చింది. కానీ, పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు మాత్రం పూర్ణకి ఇంకా రాలేదు. ‘అఖండ’ సినిమా రిలీజ్ అయి నెలలు కావస్తోంది. అయినా… పూర్ణను ఇప్పటివరకు మరో సినిమాలో ఎవ్వరూ పెట్టుకోలేదు. సినిమా చేసే ఆసక్తి ఆమెకు ఉన్నా.. ఎవరూ ఆమెకు ఛాన్స్ ఇవ్వడం లేదు. నిజానికి ఒక భారీ హిట్ పడితే.. వెంటనే హీరోయిన్లకు భారీగా అవకాశాలు వస్తాయి. కానీ, ఎంత పెద్ద హిట్ వచ్చినా.. పూర్ణ ఫేట్ మాత్రం మారడం లేదు.

Heroine Poorna
Heroine Poorna

అయితే, పూర్ణకి ఛాన్స్ లు రాకపోవడానికి ప్రధాన కారణం.. ఆమె తన రెమ్యునరేషన్ ను రెట్టింపు చేసిందని.. ప్రస్తుతం పూర్ణ ఒక్కో సినిమాకు 50 లక్షల పైనే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. ‘అఖండ’లాంటి భారీ విజయం వచ్చాక కూడా, తాను 20 లక్షలే తీసుకుంటే.. అది తన విజయానికే అవమానం అంటుందట. మొత్తమ్మీద పూర్ణ 50 లక్షలు పారితోషికం తీసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యింది.

Also Read: Mahesh- Trivikram: మహేష్ – త్రివిక్రమ్ సినిమా పై ఇంట్రెస్టింగ్ సంగతులు

అసలు పూర్ణను చిన్న నిర్మాతలు మాత్రమే పెట్టుకుంటారు. వాళ్ళు మేము అంత ఇవ్వలేం అని అంటే.. ఎందుకు ఇవ్వరు ? అనేది పూర్ణ ప్రశ్న. ఇద్దరు కొత్త నిర్మాతలు చిన్న సినిమా ఆఫర్లతో వచ్చినా ఆమె రెమ్యునరేషన్ విషయంలో నచ్చక, ఆ సినిమాలను ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లో 50 లక్షలకు తగ్గను అంటుంది. మరి పూర్ణ డిమాండ్లకు ఓకే చెప్పే నిర్మాతలు ఉన్నారా ? ఇప్పటికే పూర్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదిహేను ఏళ్ళు అవుతుంది.

Heroine Poorna
Heroine Poorna

ఈ పదిహేను ఏళ్ళల్లో ఆమె ఎన్నడూ 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు. అందుకే, ఎలాగైనా ఇప్పుడు అయినా 50 లక్షలు అందుకోవాలని బాగా ముచ్చట పడుతుంది. మరి పూర్ణ ముచ్చట తీర్చే నిర్మాత ఎవరు అనేది చూడాలి. నిజానికి పూర్ణకి అన్నీ ఉన్నాయి. కానీ అదృష్టమే లేదు. పైగా పూర్ణకి దర్శకులను ఎలా ఆకట్టుకోవాలి ? అలాగే వాళ్లను ఎలా మెప్పించాలి ? లాంటి విషయాలు కూడా బాగా తెలుసు.

కాకపోతే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది పూర్ణ కెరీర్. తాను ఎంతగా భారీగా అందాల ఆరబోసినా ఆమెకు మాత్రం ఐటమ్ సాంగ్స్, సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు గానీ, హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ లు ఇవ్వలేదు. ఆ మాటకొస్తే అఖండ సినిమాలో ఆమెది సైడ్ క్యారెక్టరే. అయినా ఈ ఫేడ్ అవుట్ భామ.. డబ్బు విషయంలో అసలు తగ్గేదే లే అంటుంది.

Also Read:Balakrishna: `అన్న‌గారు` వైపే బాలయ్య చూపు.. ప్రకటన రానుంది
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Divi Bigg Boss Host

Bigg Boss Host: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు...

Bigg Boss Host: దేశవ్యాప్తంగా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో 'బిగ్ బ్రదర్' అనే పేరుతో...
Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Oktelugu Epaper