Homeఎంటర్టైన్మెంట్Poorna: హీరోయిన్ పూర్ణకు షాక్: భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్..

Poorna: హీరోయిన్ పూర్ణకు షాక్: భర్త ఎలాంటి వాడో చెబుతూ పోస్ట్..

Poorna: ముద్దబంతి లాంటి మొహం తో అలరించే పూర్ణ చాలా తక్కువ టైంలోనే అశేష అభిమానులను సంపాదించుకుంది. మొదట్లో ఈమె నార్మల్ హీరోయిన్ అనుకున్నారు. కానీ టీవీ షో ల ద్వారా స్టార్ హీరోయిన్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఓ వైపు కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే దుబాయ్ కి చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ను అభిమానులతో పంచుకుంది. అయితే పెళ్లయి నెల గడవకముందే తన భర్త గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. సోషల్ మీడియా ఖాతాలో జరుగుతున్న ఓ మోసం గురించి ఆమెకు తెలియడంతో పూర్ణ షాక్ కు గురైందట.

Poorna
Poorna

కేరళకు చెందిన పూర్ణ తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘అవును’ సినిమాతో గుర్తింపు పొందింది. ‘సీమ టపాకాయ’ తదితర కామెడీ సినిమాల్లో నటించినా అమ్మడుకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే జబర్దస్త్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిన తరువాత పాపులారిటీ పెరిగింది. ఆ తరువాత ఢీ షో లో తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకోవడం తో ఆమెకు సినీ అవకాశాలు కూడా బాగా పెరిగాయి. ఆమె లేటెస్టుగా నాని ‘దసరా’ సినిమాలో నెగెటివ్ రోల్ లో నటిస్తుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూర్ణ తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలో పూర్ణ దుబాయ్ కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్, సీఈవో షానిద్ ఆసిఫ్ అలీ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి అరబిక్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన భర్త ఎలాంటి బహుమతులు ఇచ్చాడో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ క్రమంలో ఆమె ఎమోషనల్ అవుతూ తాను పెళ్లి చేసుకున్నా సినిమాల్లో కొనసాగుతానని చెప్పింది.

Poorna
Poorna

అయితే తన భర్త గురించి తాజాగా సంచలన విషయాలను బయటపెట్టింది. తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ నెంబర్ ను పెట్టి అందులో తన భర్త ఫొటో కూడా పెట్టింది. ఈ ఫొటోకు ‘పైనున్న నెంబర్ తో నా భర్త పేరుతో కొందరు మోసాలు చేస్తున్నారు’ అని తెలిపింది. ఈ నెంబర్ తో చాలా మంది నా భర్త పేరు చెప్పి కాంటాక్ట్ చేస్తున్నారని.. ఈ నెంబర్ కు అస్సలు రెస్పాండ్ కావద్దని తెలిపింది. ఈ నెంబర్ ద్వారా ఎవరైనా మోసపోతే నష్టానికి మేం బాధ్యులం కాదు అని నెటిజన్లను హెచ్చరించింది. దీంతో పెళ్లయిన కొత్తలోనే పూర్ణకు ఇలాంటి అనుభవం ఎదురుకావడం చర్చనీయాంశంగా మారింది.

Naga Shaurya Took Crores Of Dowry || Naga Shaurya Marriage || Naga Shaurya Future Wife Anusha Shetty
గీతూ రాయల్ కు కలిసొచ్చిన ఎలిమినేషన్! || Bigg Boss Geethu Get Chance In Pawan Kalyan Movie || Geethu
Anushka Shetty As Vantalakka || Anushka Latest Update || Tollywood || Oktelugu Entertainment

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.
Exit mobile version