Poonam Pandey: హిందీ చిత్ర సీమలో వివాదాస్పద నటిగా పేరుపొందిన పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తో బాధపడుతూ శుక్రవారం అకాల మరణం పొందారు. ఒకవేళ ఆమె ముందుగా జాగ్రత్త పడితే మరణాన్ని జయించే వారేమో. ఎందుకంటే క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే దానిని జయించవచ్చు. హిందీ చిత్ర సినిమాకు చెందిన లిసారే, సోనాలి బింద్రే, హంసానందిని వంటి వారు ముందుగానే గుర్తించడంతో క్యాన్సర్ వ్యాధిని జయించారు. అలాగే సీనియర్ నటి గౌతమి కూడా క్యాన్సర్ బారిన పడి ఆ తర్వాత దానిని జయించారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడిన వాడే. తర్వాత చికిత్స తీసుకొని కోలుకున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా క్యాన్సర్ బారిన పడ్డవారే. అమెరికాలో ఆమె చికిత్స పొంది కోలుకున్నారు. అయితే పూనం పాండే ముందుగానే మేల్కొని ఉంటే ప్రాణాలు దక్కేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలను త్వరగానే గుర్తించవచ్చు. మహిళలకు బహిష్టు సమయంలో తీవ్రంగా రక్తస్రావం కావడం, పొత్తి కడుపులో నొప్పి రావడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, అనేకసార్లు మూత్ర విసర్జన చేయడం, యోని దగ్గర మంటగా ఉండటం, శృంగారంలో పాల్గొన్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం.. వాటి లక్షణాలు కనిపించినప్పుడు కచ్చితంగా పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తిస్తారు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. క్యాన్సర్ తీవ్రత ఆధారంగా వైద్యులు వివిధ రకాల వైద్య విధానాలను అవలంబిస్తారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే వ్యాక్సిన్లు తీసుకోవడం ఒకటే మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. తొమ్మిది నుంచి 26 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిలకు ఈ వైరస్ ఇవ్వకుండా వ్యాక్సిన్ వేస్తే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కాకుండా అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా ముందుగానే క్యాన్సర్ గుర్తిస్తే.. చిన్నపాటి చికిత్సతోనే దానిని నిర్మూలించవచ్చని వైద్యులు వివరిస్తున్నారు. 29 నుంచి 45 సంవత్సరాలు ఉన్న మహిళలు ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు స్క్రీనింగ్ చేయించుకోవాలి. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్నవారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది.
స్క్రీనింగ్ మాత్రమే కాకుండా అరక్షిత పాల్గొనకూడదని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ గర్భనిరోధక మాత్రలు కూడా వేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ద్వార నిరోధించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ సర్వ వ్యాక్ అనే వ్యాక్సిన్ కనిపెట్టింది. ఈ వ్యాక్సిన్ ను రెండు వేల డోసుల వరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు ఉచితంగా వేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ విషయాన్ని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆరు కోట్ల డోసులను ఇచ్చేందుకు సీరమ్ సంస్థ ఒప్పుకుంది. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు ప్రకటించారు.. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి కేంద్రం ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతోంది.వ్యాక్సిన్ విరివిగా అందుబాటులోకి వస్తే ఒక్కో డోస్ రెండు వందల నుంచి 250 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.. మరోవైపు గర్భాశయ ముఖద్వార, రొమ్ము క్యాన్సర్ కేసులు గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరంలో ఏ మాత్రం మార్పులు ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Poonam pandey died of cervical cancer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com