Salaar 2: సలార్ 2 ఎప్పుడో తెలుసా? ఇంతకీ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందంటే..

సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది. ఇక సలార్ కి సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం ఉంటుందని క్లైమాక్స్ లో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. సలార్ పార్ట్ 1లో చూపించిన కథ ఇంకా సగం మాత్రమే.. చాలా ప్రశ్నలకు సమాదానాలు చెప్పకుండా ప్రశాంత్ నీల్ వదిలేశారు.

Written By: Swathi, Updated On : February 3, 2024 2:59 pm
Follow us on

Salaar 2: డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో నటించిన సినిమాలు సూపర్ హిట్ లను సొంతం చేసుకుంటాయి. అయితే సలార్ సినిమా కంటే ముందు వరుసగా అన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. కానీ సలార్ సినిమా మళ్లీ ఆయనకు మంచి హిట్ ను సంపాదించింది పెట్టింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ ను సొంతం చేసుకొని ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోష పెట్టింది. ఇక హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అదే స్థాయిలో సిల్వర్ స్క్రీన్ దగ్గర కలెక్షన్లు రాబట్టింది.

సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది. ఇక సలార్ కి సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం ఉంటుందని క్లైమాక్స్ లో డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. సలార్ పార్ట్ 1లో చూపించిన కథ ఇంకా సగం మాత్రమే.. చాలా ప్రశ్నలకు సమాదానాలు చెప్పకుండా ప్రశాంత్ నీల్ వదిలేశారు. వాటిని పార్ట్ 2లో చూపించబోతున్నట్టు హింట్ ఇచ్చారు. దీంతో సలార్ 2 సినిమా ఎప్పుడు వచ్చినా చూడడానికి ఫ్యాన్స్ నుంచి రెగ్యులర్ ఆడియన్స్ వరకు అందరూ ఎదురుచూస్తున్నారు.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాలిడ్ హిట్ సినిమా సలార్. ఇక సినిమా సీక్వెల్ ను వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. అయితే మరోవైపు ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సలార్ 2 ఫినిష్ చేయడంపై దృష్టిపెట్టారట ప్రశాంత్ నీల్.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తి చేసుకుంది. మిగిలిన పెండింగ్ షూట్ ను కూడా కంప్లీట్ చేసుకోవడానికి సిద్దమయ్యారట. అయితే సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. ఈ లోపు కల్కి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్దం అవుతుంది. ఇక మారుతితో చేస్తున్న రాజా సాబ్ ఒక్కటే ఉంటుందట. మొత్తం మీద సలార్, రాజా సాబ్ సినిమాలను బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్ తో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట ప్రభాస్.