Hari Hara Veeramallu:కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అయిన హీరోయిన్స్ లో ఒకరు పూనమ్ కౌర్(Poonam Kaur). ఈమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ అన్ని సినిమాలు చేసినా రానటువంటి గుర్తింపు ఆమెకు సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అది కూడా వివాదాలతో. ప్రముఖ సినీ దర్శకుడు, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి అత్యంత ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) గతం లో ఈమెకు ‘జల్సా’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ రోల్ ఇస్తానని చెప్పి , తనని అన్ని విధాలుగా వాడుకొని చివరికి మోసం చేసాడని, ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్లినా ఆయన పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది.
అనేక సందర్భాల్లో ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తన ట్విట్టర్ ఖాతా ద్వారా సెటైర్లు వేస్తూనే ఉంటుంది. ఈరోజు కూడా త్రివిక్రమ్ పై ఆమె వేసిన ఒక సెటైరికల్ ట్వీట్ సంచలనం గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘క్రిష్(Krish Jagarlamudi) మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. అతను తన సొంతంగా విభిన్నమైన కథలను రాసుకుంటాడు. అద్భుతంగా తెరకెక్కిస్తాడు. కొంతమంది(త్రివిక్రమ్ శ్రీనివాస్) లాగా పీర్ స్తంట్స్ చేయడం, సన్నివేశాలను కాపీ కొట్టి కాపీ రైట్ స్ట్రైక్స్ ని పొందడం అతనికి చేత కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. రేపు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ట్రైలర్ విడుదల సందర్భంగా మేకర్స్ ఆ ట్రైలర్ ని పవన్ కళ్యాణ్ కి నిన్న రాత్రి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ఆయన నుండి మంచి రెస్పాన్స్ రావడంతో,మేకర్స్ ఆ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా లో అందుకు సంబంధించిన వీడియో ని విడుదల చేసారు.
Also Read: అల్లు అర్జున్ డేట్స్ కోసమే రామ్ చరణ్ పై దిల్ రాజు బ్రదర్స్ నోరు పారేసుకున్నారా..?
ఈ వీడియో లో పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఈ వీడియో ని మూవీ టీం అప్లోడ్ చేసిన నిమిషాల గ్యాప్ లోనే పూనమ్ కౌర్ నుండి ఈ ట్వీట్ వచ్చింది. దీంతో అందరికీ క్లారిటీ వచ్చింది, ఈమె హరి హర వీరమల్లు చిత్రాన్ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని. ఈమె ట్వీట్ వేయడం, అందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక రేంజ్ లో నెగటివ్ కామెంట్స్ చేయడం ట్విట్టర్ లో సర్వ సాధారణం అయిపోయింది. ఈమెకు నిజంగా త్రివిక్రమ్ అన్యాయం చేసి ఉండుంటే, ఆ ఆధారాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి వెళ్తే ఆమెకు న్యాయం జరగొచ్చు,కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. కేవలం నన్ను కూడా గుర్తించండి అని చెప్పడానికే ఈమె త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ని వాడుకుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.