Poonam Kaur : పూనమ్ కౌర్(Poonam Kaur Lal)..ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువే, కానీ సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ కామెంట్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) పై ఇది వరకు ఆమె ఎన్నో సంచలన ఆరోపణలు పరోక్షంగా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు జల్సా సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేసాడని, తనని అన్ని విధాలుగా వాడుకున్నాడని, న్యాయం చెయ్యమని ఎంత మంది సినీ పెద్దల దగ్గరకి వెళ్లినా తనకు న్యాయం జరగలేదని పూనమ్ కౌర్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అదే విధంగా ఆమె పవన్ కళ్యాణ్ పై కూడా పరోక్షంగా చాలా సెటైర్లు విసురుతూ ఉండేది. ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా పవన్ ఫ్యాన్స్ టార్గెట్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విరుచుకుపడింది.
Also Read : మహేష్ బాబు ను ప్రేమించిన విషయం నమ్రత మొదటగా చిరంజీవికి చెప్పిందా..?
ఆమె మాట్లాడుతూ ‘నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఝాన్సీ గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ప్రస్తుతం బిజీ గా ఉన్నారని, త్వరలోనే మీటింగ్ పెడుతామని, అప్పటి వరకు డిస్టర్బ్ చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియా లో నేను మా అసోసియేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ లో ఎవరి పేరు తియ్యలేదని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. కంప్లైంట్ లో నేను స్పష్టంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుని ప్రస్తావించాను. ఆయనకు సినీ ఇండస్ట్రీ పరంగా, రాజకీయ పరంగా కొంతమంది బలంగా సపోర్ట్ చేయడం వల్ల సేవ్ అవుతున్నాడు అని కూడా ఆమెకు చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్.
ఈ విషయంపై అవసరమైతే మహిళా గ్రూప్ మెంబెర్స్ తో కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమె మెయిల్ పెట్టినప్పుడు మా అసోసియేషన్ నుండి వచ్చిన రిప్లై ని కూడా ఆమె సోషమ్ మీడియాలో చెప్పుకొచ్చింది. పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రీసెంట్ గానే ఆమె సీఎం చంద్రబాబు నాయుడు ని కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ ని బహుమతిగా అందించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టీ చూస్తే ఆమె టీడీపీ పార్టీ లో కూడా మంచి సర్కిల్ ఉంది. ఎలాంటి పరిచయాలు లేకుండా ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ని కలవడం అంత తేలికైన విషయం కాదని చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు. కాబట్టి భవిష్యత్తులో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇండస్ట్రీ లో ఎదో పెద్ద బాంబు పేలే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనేది తెలుస్తుంది.