Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: ఆ మూడు పెళ్లిళ్లు.. పవన్ కళ్యాణ్ పై మళ్లీ పూనమ్ కౌర్ దారుణ...

Poonam Kaur: ఆ మూడు పెళ్లిళ్లు.. పవన్ కళ్యాణ్ పై మళ్లీ పూనమ్ కౌర్ దారుణ కామెంట్స్.. దుమారం

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ సినిమా కంటే కూడా వివాదాలతోనే తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె సామాజిక, పొలిటికల్ అంశాల మీద తరచుగా స్పందిస్తుంది. పూనమ్ కౌర్ పరోక్షంగా దర్శకుడు త్రివిక్రమ్, హీరో పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తారనే వాదన ఉంది. వాళ్ళను టార్గెట్ చేస్తూ ఆమె ఇండైరెక్ట్ గా పోస్ట్స్ పెడతారని కొందరు అంటారు. ఈసారి ఆమె పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ప్రత్యర్థులు ఆయన్ని మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని విమర్శలు చేస్తూ ఉంటారు.

ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ పలుమార్లు వివరణ ఇచ్చారు. నేను సరదా కోసం వివాహాలు చేసుకోలేదు. వ్యక్తిగత కారణాలతో చట్టబద్ధంగా విడిపోయాము. వాళ్లకు భరణం కూడా చెల్లించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అయినప్పటికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటాడు. తాజాగా వైసీపీ క్రియాశీలక సభ్యుడు ఒకరు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆయన టెస్లా సంస్థను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలని అధినేత ఎలన్ మస్క్ ని కోరాడు.

ఈ ట్వీట్ కోట్ చేసిన పూనమ్ కౌర్… ఎలన్ మస్క్ మూడు వివాహాలు చేసుకున్నాడు? మరి పర్లేదా! అని సెటైరికల్ కామెంట్ పోస్ట్ చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ని వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు. మరి ఎలన్ మస్క్ కి కూడా మూడు వివాహాలు అయ్యాయి. ఆ లెక్కన ఆయన కూడా మీ దృష్టిలో చెడ్డవాడే కదా అని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ ఉంది. అయితే పూనమ్ సదరు కామెంట్స్ లో పవన్ కి సప్పోర్ట్ చేయలేదు. ఎద్దేవా చేసిందనే వాదన కూడా ఉంది.

ఏది ఏమైనా పూనమ్ కౌర్ ట్వీట్ మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులను, నెటిజెన్స్ ని ఆకర్షించింది. పూనమ్ కౌర్ తెలుగులో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించింది. వినాయకుడు వంటి హిట్ మూవీ ఆమె ఖాతాలో ఉంది. ఈ పంజాబీ భామ హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. తనను నాన్ లోకల్ అని కొందరు విమర్శిస్తున్నారు. నేను తెలంగాణ బిడ్డనే అని గతంలో కామెంట్స్ చేసింది. పూనమ్ కి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తగ్గాయి.

Exit mobile version