https://oktelugu.com/

Poonam Bajwa : కుర్రాళ్లను పిచ్చోళ్లను చేస్తున్న పూనమ్ బజ్వా అందాలు..

సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. లేటేస్టుగా ఓ హీరోయిన్ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 29, 2024 / 06:14 PM IST

    Poonam Bajwa

    Follow us on

    Poonam Bajwa : సినిమా అంటే రంగుల ప్రపంచం. అయితే ఈ ప్రపచంలో కష్టాలు, సుఖాలు ఉంటాయి. వరుస అవకాశాలు ఉంటే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుది. అవకాశాలు తగ్గితే మాత్రం కష్టమనిపిస్తుంది. అయితే ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమకు వచ్చిన వాళ్లల్లో అందరూ సక్సెస్ కాలేదు. కొందరు మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగతా వారు వచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ సద్వినియోగం చేస్తున్నారు. అయితే ఇంకొందు మాత్రం సినిమాల్లో కొన్నాళ్లు నటించి ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. లేటేస్టుగా ఓ హీరోయిన్ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది.

    ఆ హీరోయిన్ ఎవరో కాదు. పూనమ్ బజ్వా. మహా రాష్ట్రలోని పూణెలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఓ వైపు చదువుతూనే పార్ట్ టైం మోడలింగ్ చేశారు. ఆ తరువాత 2005లో మిస్ పూణె కిరీటాన్ని పొందారు. అయితే ఓ సారి ఈమె ర్యాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కూచిపూడి వెంకట్.. తాను అనకుంటున్న ‘మొదటి సినిమా’ కోసం పూనమ్ బజ్వాను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో పూనమ్ అందంగా కనిపించారు. అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో పూనమ్ బజ్వాకు గుర్తింపు రాలేదు.

    ఆ తరువాత నాగార్జున ‘బాస్’ సినిమాలో పూనమ్ కు సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆకట్టుకోకపోయినా పూనమ్ కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత పరుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది. అయితే అప్పటికే కొందరు హీరోయిన్లు తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పూనమ్ తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లారు. అక్కడ తనవట్టు, కచేరి ఆదామ్బం, ద్రోహి వంటి సినిమాల్లో నటించారు. ఆ తరువాత కన్నడం, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. అయితే పలు సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు స్టార్ గుర్తింపు రావడం లేదు.

    అయితే ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ సినీ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది. లేటేస్ట్ గా రెడ్ డ్రెస్ లో కనిపించిన పూనమ్ తన చక్కని స్మైల్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. అలాగే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల మనసును దోచుకుంటోంది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో టైం టూ టైం హాట్ పిక్స్ ను షేర్ చేయడంతో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగాయి.

    పూనమ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నాు. కానీ ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. అయితే సినిమాల్లో అవకాశాల సంగతి ఎలా ఉన్నా పెళ్లి ప్రస్తావన మాత్రం ఎక్కడా ఎత్తడం లేదు. ఎందుకంటే ఆమెతో పాటు సినిమాల్లో నటించిన కొందరు ఇప్పటికే వివాహం చేసుకున్నారు. తన కలల రాకూమారుడు ఎవరో చెప్పాలని కొందరు ఫ్యాన్స్ కోరుతున్నారు.

    poonam bazwa