https://oktelugu.com/

Adivi Shesh : 100 కోట్ల రూపాయిల క్లబ్ లోకి అడుగుపెట్టిన అడవి శేష్..మార్కెట్ లో డిమాండ్ మాములుగా లేదుగా!

అడవి శేష్ కి మార్కెట్ ని తెచ్చిపెట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'గూఢచారి 2 ' తెరకెక్కుతుంది. అయితే పార్ట్ 1 కి శశి కుమార్ తిక్క దర్శకత్వం వహించగా,సీక్వెల్ కి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దాదాపుగా 100 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 6:52 pm
    Adivi shesh

    Adivi shesh

    Follow us on

    Adivi Shesh : అడవి శేష్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘గూఢచారి’. హీరో గా అప్పుడప్పుడే ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్న అడవి శేష్ కి ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని తెచ్చిపెట్టిన సినిమా ఇది. కేవలం 6 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా క్వాలిటీ చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆరోజుల్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ద్వారానే నాగార్జున మేనకోడలు సుప్రియ టాలీవుడ్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

    అడవి శేష్ కి మార్కెట్ ని తెచ్చిపెట్టిన ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘గూఢచారి 2 ‘ తెరకెక్కుతుంది. అయితే పార్ట్ 1 కి శశి కుమార్ తిక్క దర్శకత్వం వహించగా,సీక్వెల్ కి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దాదాపుగా 100 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. తక్కువ బడ్జెట్ తో హై క్వాలిటీ ఔట్పుట్ ని రాబట్టుకునే అడవి శేష్, ఈ స్థాయి బడ్జెట్ తో సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం మన టాలీవుడ్ కి పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ ఏర్పడింది కాబట్టి, ఈ కాలం లో ఈ స్థాయి క్వాలిటీ సినిమాలు ఇస్తే బాలీవుడ్ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. పార్ట్ 1 షూటింగ్ మొత్తం ఇండియా లోనే పూర్తి చేయగా, పార్ట్ 2 మాత్రం ఫ్రాన్స్, స్విట్జర్ ల్యాండ్, పోలాండ్, ఇటలీ వంటి దేశాల్లో చిత్రీకరించారు. అందుకే ఈ స్థాయి బడ్జెట్ అవుతుందని అంటున్నారు మేకర్స్.

    శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క అడవి శేష్ స్పై జానర్స్ లో థ్రిల్లర్ సినిమాలను చేస్తూ సినిమా సినిమాకి తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఒక సాధారణ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అడవి శేష్, ఆ తర్వాత విలన్ గా అనేక సినిమాలు చేసాడు. తొలుత ఆయన ‘పొగ’ అనే చిత్రం ద్వారా హీరో గానే ఎంట్రీ ఇచ్చాడు కానీ, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ సమయంలో ఆయనకి ‘పంజా’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అడవి శేష్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వరుసగా విలన్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆయన ‘క్షణం’ చిత్రం తో తొలిసారి హీరో గా సక్సెస్ ని అందుకున్నాడు. అక్కడి నుండి నేడు 100 కోట్ల రూపాయిల హీరో గా ఎదగడం చిన్న విషయం కాదు. ‘గూఢచారి 2 ‘ చిత్రం ఆయన్ని ఏ రేంజ్ కి తీసుకెళ్తుందో చూడాలి.