Poojitha: వైజాగ్ భామ పూజిత పొన్నాడ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆమె డెబ్యూ మూవీ ఊపిరి. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఊపిరి చిత్రంలో నాగార్జున-కార్తీ హీరోలుగా నటించారు. తమన్నా హీరోయిన్ కాగా పూజిత చిన్న గెస్ట్ రోల్ చేసింది. అనంతరం ‘దర్శకుడు’ చిత్రంలో కనిపించారు. పూజితకు రంగస్థలం మూవీ కొంత ఫేమ్ తెచ్చింది. ఈ చిత్రంలో ఆమె హీరో రామ్ చరణ్ అన్నయ్య పాత్ర చేసిన ఆదిపినిశెట్టి లవర్ రోల్ చేసింది. పాత్ర నిడివి తక్కువే అయినా… ఆమె ప్రేమకథ వలనే సినిమా మలుపు తిరుగుతుంది.
రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7 ఇలా వరుస చిత్రాల్లో నటించారు. అయితే ఆమెకు బ్రేక్ రాలేదు. సపోర్టింగ్ రోల్స్ కి మాత్రమే పరిమితం చేశారు. అవి కూడా చిన్న చిత్రాలు. కల్కి మూవీలో పోలీస్ పాత్ర చేయడం విశేషం. చక్కని రూపం, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా కూడా పూజిత కెరీర్లో ఎదగలేదు. చెప్పాలంటే ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశం రాలేదు. ఇతర తెలుగు హీరోయిన్స్ మాదిరే పూజితను టాలీవుడ్ దర్శక నిర్మాతలు పట్టించుకోవడం లేదు.
అయితే పూజితకు బంపర్ ఛాన్స్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భారీ పాన్ ఇండియా చిత్రం హరి హర వీరమల్లులో ఛాన్స్ దక్కిందట. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ ఐటెం సాంగ్ చేస్తున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ మూవీ అంటే రీచ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన మూవీలో చిన్న పాత్ర చేసినా పేక్షకులకు దగ్గర కావచ్చు. మరి ఐటెం నెంబర్ అనే మాములుగా ఉండదు. పూజితకు హరి హర వీరమల్లు బ్రేక్ ఇచ్చే సూచనలు కలవు.
నిర్మాత ఏ ఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ దర్శకుడిగా ఉన్నారు. అనుకోని కారణాలతో హరి హర వీరమల్లు షూట్ వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. 2024 ఏపీ ఎన్నికలు అనంతరం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ మూవీపై పూజిత భారీగా ఆశలు పెట్టుకున్నారు. హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. నోరా ఫతేహి సైతం ఓ పాత్ర చేస్తున్నారని వినికిడి.
కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ హ్యాపీగా లాగించేస్తుంది పూజిత. తాజాగా బీచ్ వెకేషన్ కి వెళ్ళింది. నిద్రలేస్తూనే అందమైన సముద్రాన్ని వీక్షించింది. ఇక నైట్ డ్రెస్ లో పూజిత హాట్ లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది. పూజిత గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.
View this post on Instagram