
టాల్ బ్యూటీ ‘పూజా హెగ్డే’ టాలీవుడ్ లోనే వెరీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డమ్ తో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే, పూజా.. మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ‘పూజా హెగ్డే’ పాత్ర చనిపోతుందని.. తానూ ప్రేమించిన వ్యక్తి చనిపోయాడని తెలిసిన వెంటనే ఆత్మహత్య చేసుకుంటుందని.. మొత్తంగా ఆమె పాత్ర అలాగే ఆమె డెత్ సీన్ సినిమాలోనే వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.
Also Read: హాట్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం !
నిజానికి పూజా చేస్తోన్న పాత్రలో మొదట సమంతను అనుకున్నారు. కాకపోతే సమంత కంటే పూజా బెటర్ అని కొరటాల ఫీల్ అయ్యాడట. ఇక చరణ్ సరసన హీరోయిన్ గా నటించే చాన్స్ వెదుక్కుంటూ వచ్చే సరికి పూజా కూడా వెంటనే ఒప్పేసుకుంది. డేట్స్ కుదరకపోయినా.. ప్రస్తుతం చేస్తోన్న సినిమాల మేకర్స్ ను రిక్వెస్ట్ చేసుకుని మరీ ఆచార్య కోసం డేట్స్ కేటాయించింది. ఇక ఈ సినిమాలో అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ చాలా బాగుంటాయని టాక్. షూటింగ్ కు విరామం లేకుండా షూట్ చేసి ఆచార్యను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
Also Read: కేసీఆర్ కు టాలీవుడ్ స్టార్స్.. భారీ గిఫ్ట్..
వచ్చే వారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ను తీస్తారని తెలుస్తోంది. అన్నట్లు కొరటాల ఈ సినిమాలో ఓ కామెడీ ట్రాక్ ను పెట్టారు. పైగా కొరటాల శివ లాంటి టాప్ డైరక్టర్, మెగాస్టార్ హీరోగా చేస్తున్న సినిమా కావడం, అందుకే మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
Comments are closed.