హాట్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం !

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ, ఆ తరువాత కాలంలో హాట్ రోల్స్ లో బోల్డ్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పైగా ఒకప్పుడు ఎప్పుడూ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లోనే కనిపిస్తూ ఉండేది. రోజుకోక హాట్ హాట్ ఫోటోతో రచ్చ చేసేది తేజస్వి. సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ బ్యూటీ అందరూ […]

Written By: admin, Updated On : February 16, 2021 4:15 pm
Follow us on


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న క్యారెక్టర్ లో దర్శనమిచ్చిన తేజస్వి మదివాడ, ఆ తరువాత కాలంలో హాట్ రోల్స్ లో బోల్డ్ యాక్టింగ్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. పైగా ఒకప్పుడు ఎప్పుడూ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లోనే కనిపిస్తూ ఉండేది. రోజుకోక హాట్ హాట్ ఫోటోతో రచ్చ చేసేది తేజస్వి. సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ బ్యూటీ అందరూ ఆశర్యపోయేలా స్కిన్ షోతో కేక పుట్టిస్తూ తనకు తానే సాటి అనుకునేలా కొన్నాళ్లపాటు కెరీర్ ను కొనసాగించింది.

Also Read: కేసీఆర్ కు టాలీవుడ్ స్టార్స్.. భారీ గిఫ్ట్..

మొత్తానికి హిందీలో ఒక సన్నీ లియోన్, ఒక పూనమ్ పాండే ఎలాగో, తెలుగులో తేజస్వి అలాగా అన్నట్లు మరిపించింది. అయితే, అదంతా గతం అంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు తేజస్వి మొత్తంగా సంప్రదాయబద్ధంగా మారిపోయిందట, తనలోని బోల్డ్ నెస్ కి అలాగే హాట్ ఫోటోషూట్ లకు బ్రేక్ ఇచ్చిందట. దానికి తగ్గట్లుగానే సోషల్ మిడియాలో పోస్టులు కూడా తగ్గించింది అమ్మడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే.. ఆ బోల్డ్ నెస్ వల్ల తనకు ఎలాంటి లాభం కలగలేదట. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో బోల్డ్ గా కూడా యాక్టు చేసింది.

Also Read: తన ఫోటోలు చూసి నిధి అగర్వాల్ షాక్ !

కానీ అలాంటి పాత్రలు, ఫోటోషూట్ ల వల్ల ఆమె కెరీర్ కి ఎలాంటి హెల్ప్ కలగకపోగా.. వచ్చే క్యారెక్టర్స్ కూడా రాకుండా పోయాయి. అసలుకే బోల్డ్ క్యారెక్టర్స్ సినిమాలో ఉండేది ఒకటో రెండో. వాటికీ కూడా విపరీతమైన పోటీ. ఇలాంటి నేపథ్యంలో అలాంటి పాత్రలకు దూరంగా ఉండటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేసింది తేజస్వి. ఐతే, ఇది పర్మినెంట్ డెసిషనా? లేదా విరామమా అనేది చూడాలి. ఇక టీవీ షోల్లోగాని, సినిమాల్లోగాని ఎక్కడా అవకాశం వచ్చినా అక్కడ వాలిపోతూ చాన్స్ లను ఒడిసి పట్టుకుంటూ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తోంది ఈ బ్యూటీ. మరోపక్క అందరికీ ఇంకా చేరువ అవడానికి నానా తిప్పలు పడుతోంది అనుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్