https://oktelugu.com/

ప్రభాస్ కోసం పూజా హెగ్డే క్లాసికల్ డాన్స్ !

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉండేలా ఆమె గెటప్ ను డిజైన్ చేశారట. ఇప్పటికే ఆమె డాన్స్ కి సంబంధించిన సీన్స్ […]

Written By:
  • admin
  • , Updated On : June 11, 2020 / 06:55 PM IST
    Follow us on


    రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘రాధే శ్యామ్’. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డాన్సర్ గా కనిపించనుందట. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ క్లాసిక్ డాన్సర్ ను పోలి ఉండేలా ఆమె గెటప్ ను డిజైన్ చేశారట. ఇప్పటికే ఆమె డాన్స్ కి సంబంధించిన సీన్స్ ను పూర్తి చేశారు. ఆ మధ్య విడుదలైన గద్దలకొండ గణేష్ చిత్రంలో పూజా 90ల నాటి కాలేజ్ గర్ల్స్ గెటప్ లో అలరించారు. మరి ఈ చిత్రంలో మరి ఆమె ఎలా ఉంటారో చూడాలి.

    కాగా ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ కూడా రెండు గెటప్స్ లో కనిపిస్తారట. రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను జూలై సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో తీయనున్నారు.

    ఇక ఈ సినిమాలో బాగా ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాడట ప్రభాస్. అందుకే ఈ లాక్ డౌన్ లో స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు.. ఆ దిశగా రైటర్స్ చేత స్క్రిప్ట్ వర్క్ కూడా చేయించిన్నట్లు తెలుస్తోంది. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.