Mahesh Babu Pooja Hegde: నాగ చైతన్య హీరో గా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా పూజా హెగ్డే అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ , హిందీ బాషలలో కూడా ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సౌత్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతుంది..ఇటీవలే ఈమె బాలీవుడ్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది..ఇలా వరుసగా క్రేజీ ఆఫర్స్ వస్తుండడం తో పూజ హెగ్డే డిమాండ్స్ తారాస్థాయికి చేరిపోయిందట..ముఖ్యంగా ఈమెకి ఇటీవల కాలం లో బాలీవుడ్ బడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కుతుండడం తో టాలీవుడ్ అంటే చిన్న చూపు మొదలైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ముఖ్యంగా నిర్మాతలకు ఈమె పెట్టే డిమాండ్స్ చిరాకు రప్పించేలా ఉందట..ఇటీవలే ఈమె హీరోయిన్ గా నటించిన తమిళ సినిమా బీస్ట్ నిర్మాత కి పట్టపగలే చుక్కలు చూపించింది..ఈ సినిమా షూటింగ్ సమయం లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఈమె చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులు లక్షల రూపాయిలు దాటింది అట..దీనితో నిర్మాతకు వెరెత్తిపోయ్యి ఆ బిల్లులు మొత్తం నువ్వే కట్టాలంటూ పూజ హెగ్డే కి పంపాడు.

Also Read: Senior Hero Naresh Marriage Life: ముగ్గురు భార్యలతో ముగ్గురు పిల్లలు..మూడో భార్యను నరేశ్ వదలలేదా?
ఇప్పుడు త్వరలో ఆమె చెయ్యబొయ్యే మహేష్-త్రివిక్రమ్ సినిమాకి కూడా డిమాండ్స్ వేరే లెవెల్ లో పెట్టినట్టు సమాచారం..ఈ సినిమాకి పూజ హెగ్డే కేవలం 45 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చింది..దర్శక నిర్మాతలు కేవలం ఈ 45 రోజుల్లోనే ఆమెకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయాలట..ఆ 45 రోజులు దాటితే ఆమె షూటింగ్ కి రాదట..అంతే కాకుండా ఈమె ఈ సినిమా లో నటించేందుకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయిల పారితోషికం డిమాండ్ చేస్తుందట..ఇంత భారీ రెమ్యూనరేషన్ తో పాటుగా ఆమెతో పాటు వచ్చే స్టాఫ్ కి అయ్యే ఖర్చులు కూడా నిర్మాతనే భరించాలట..ఇవన్నీ తెలుసుకున్న మహేష్ చిరాకుపడి ఈమెని వెంటనే మన సినిమా నుండి పీకేయొచ్చు గా అని త్రివిక్రమ్ తో అన్నాడట..కానీ ఇప్పటికే ఆమెతో కమిట్ అయిపోయాము కాబట్టి ఈ సినిమా వరుకు ఇలా కానిచ్చేద్దాం అని త్రివిక్రమ్ మహేష్ కి సర్దిచెప్పినట్టు సమాచారం..గతం లో పూజ హెగ్డే మహేష్ బాబు తో మహర్షి అనే సినిమా చేసింది..ఈ సినిమా షూటింగ్ సమయం లో పూజ హెగ్డే ఇన్ని డిమాండ్స్ చెయ్యలేదట..రోజు రోజుకి ఆమె రేంజ్ పెరిగిపోవడం వల్లే ఇప్పుడు ఇంత షో చేస్తుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న విషయం.

Also Read: Chiranjeevi Movie: 50 లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?
[…] Also Read: Mahesh Babu Pooja Hegde: మహేష్ కి చుక్కలు చూపిస్తున్… […]