Pooja Hegde: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ఒకప్పుడు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు పూజ హెగ్డే డేట్స్ కోసం క్యూలు కట్టేవారు. కానీ ఆమె మన తెలుగు సినిమాలంటే చిన్న చూపో ఏమో తెలియదు కానీ, బాలీవుడ్ వైపు మనసు మరలింది. ఎంతలా అంటే బాలీవుడ్ సినిమా కోసం మహేష్ బాబు(super Star Mahesh Babu) సినిమాని కూడా వదిలేసుకునేంతలా మారిపోయింది. ‘గుంటూరు కారం’ చిత్రం లో సగానికి పైగా సన్నివేశాలు పూజ హెగ్డే తోనే చేసారు. కానీ ఆమె బాలీవుడ్ సినిమాతో బిజీ గా ఉండడం వల్ల ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలోకి శ్రీలీల(srileela) వచ్చింది. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె బాలీవుడ్ లో చేసిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.
వరుస ఫ్లాప్స్ కారణంగా భవిష్యత్తులో బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు రావడం కూడా కష్టమే. తమిళం లో ఈమధ్య వరుసగా సినిమాలు ఒప్పుకుంటుంది. ఇప్పటికే విజయ్(Thalapathy Vijay) తో ఒక సినిమా ఒప్పుకుంది, అదే విడగా సూర్య(suriya sivakumar) తో ‘రెట్రో’ చిత్రం చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య పూజా హెగ్డే ఇంటర్వ్యూస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. హీరోలతో తనతో ఎదురైన అనుభవం గురించి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘తోటి నటీనటుల కారణంగా ఇబ్బందులకు గురి అవ్వడం వంటివి ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఉంటుంది. పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలి. షూటింగ్స్ లో హీరో కి సంబంధించిన వ్యానిటీ వ్యాన్ సెట్స్ పక్కనే పెట్టుకునే అవకాశం కల్పిస్తారు’.
‘షాట్ రెడీ అని పిలవగానే హీరో వెంటనే కిందకి దిగి సెట్స్ లోకి వెళ్లిపోవచ్చు. హీరోయిన్స్ కి సంబంధించిన వ్యానిటీ వ్యాన్ సెట్స్ కి చాలా దూరంగా ఉంటుంది. మేము బరువైన కాస్ట్యూమ్స్ ని ధరించి, భారీ లెహంగాలు వేసుకొని సెట్స్ వరకు నడుచుకుంటూ రావాలి. ఆలస్యం అయితే మమ్మల్ని తిడుతారు. ఇలాంటి వివక్ష ఎందుకు చూపిస్తారు?, ఇక సినిమా పోస్టర్స్ లో కూడా ఒక్కోసారి హీరోయిన్ పేరు ఉండదు. నటనకు ప్రాధాన్యం ఉన్న లవ్ స్టోరీ లో నటించినా గుర్తింపు ఇవ్వరు. సినిమా అంటే కేవలం ఒక్క హీరో మీదనే నడవదు కదా, హీరోయిన్ కి ప్రాధాన్యత లేని సినిమాల్లో మా పేర్లు కనిపించకపోయినా పెద్దగా బాధ వెయ్యదు కానీ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసినప్పుడు కూడా గుర్తించకపోవడం వంటివి బాధకి గురి చేస్తాయి అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఇంతకు పూజ హెగ్డే అంత బీభత్సంగా నటించిన సినిమా ఏది అయ్యుంటుంది? అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.