https://oktelugu.com/

ప్చ్.. ‘పూజా హెగ్డే’ బ్యాచిలర్ కి నో చెప్పేసింది !

కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు సినిమా వాళ్ళు. ఇక, జూన్ నుండి షూటింగ్స్ కి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే ఎట్టకేలకు జూన్ లో మాత్రం సెట్స్ పైకి రాను అంటుంది. సర్వ జాగ్రత్తలతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ల్యాండ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చినా, బుట్టబొమ్మ మాత్రం నో అనేస్తోంది. దాంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పరిస్థితి మరింత అయోమయమైపోయింది. కొంత […]

Written By:
  • admin
  • , Updated On : May 19, 2021 / 03:35 PM IST
    Follow us on

    కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చారు సినిమా వాళ్ళు. ఇక, జూన్ నుండి షూటింగ్స్ కి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇంటికే పరిమితమైన పూజా హెగ్డే ఎట్టకేలకు జూన్ లో మాత్రం సెట్స్ పైకి రాను అంటుంది. సర్వ జాగ్రత్తలతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ల్యాండ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చినా, బుట్టబొమ్మ మాత్రం నో అనేస్తోంది.

    దాంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పరిస్థితి మరింత అయోమయమైపోయింది. కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. గట్టిగా పది రోజులు షూట్ చేస్తే, అంతా సెట్ అయిపోతుంది. కానీ, ఆ అవకాశం ఈ హాట్ బ్యూటీ బ్యాచిలర్ కి ఇచ్చేలా లేదు. సెట్స్ పైకి వచ్చినా వరుసగా పది రోజుల పాటు డేట్స్ ఇచ్చే పొజిషన్ తనకు లేదని, దయచేసి మరో నెల వరకూ డేట్స్ అడగొద్దు అంటూ నిర్మాతకు మొహమాటం లేకుండా చెప్పిందట పూజా.

    అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకే డేట్స్ ఇవ్వకపోతే ఎలా అనేది నిర్మాత బన్నీవాసు వెర్షన్. అయితే, నిజానికి పూజా ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. దర్శకుడి పైత్యం కారణంగా ఎక్కువగా రీషూట్ చేయాల్సి వస్తోంది. ఆ కారణంగా అదనపు డేట్స్ ను కేటాయించాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తానూ, ఇప్పట్లో డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదని పూజా స్మూత్ గా చెప్పుకొస్తోందట.

    మరోపక్క ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, తన కొత్త సినిమాని మొదలుపెట్టాలని అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే జూన్ ఫస్ట్ వీక్ నుండే సెట్స్ పైకి వచ్చేయాలనేది అఖిల్ ప్లాన్. పైగా తానూ ఎనీ టైం రెడీ అన్నట్టు యూనిట్ కు సమాచారం కూడా అందించాడు. కానీ, అఖిల్ ఒక్కడే వస్తే సరిపోదు కదా, ముఖ్యంగా పూజా హెగ్డే కూడా రావాలి. మరి ఆమె రాక కోసం యూనిట్ ఎదురుచూడాల్సిందేనా ? మరోపక్క బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని ఇంకా లాగి లాగి పెద్ద ల్యాగ్ చేసేలా ఉన్నాడు.