Pooja Hegde పెద్దగా నటన లేకపోయినా తన అందం తో కుర్రకారులను పిచ్చెక్కిస్తూ పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న పూజ హెగ్డే కి పాపం ఈ మధ్య టైం కలిసి రావడం లేదు.. నిన్న మొన్నటి దాకా గోల్డెన్ లెగ్ అని పిలవబడే ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఐరన్ లెగ్ గా మారిపోయింది.. రీసెంట్ గా ఆమె చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి.

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో విజయ్ తో ఈమె చేసిన బీస్ట్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది..ఇక ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ చిత్రం ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది..అందరికీ తెలిసిందే..పోనీ బాలీవుడ్ లో అయినా లక్ కలిసి వస్తుంది అనుకుంటే..రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన ‘సర్కస్ ‘ సినిమా మరో భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ప్రస్తుతం ఈమె సల్మాన్ ఖాన్ తో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది..ఇలా వరుసగా ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకోవడం లో మాత్రం వెనకడుగు వెయ్యలేదు..అందుకు కారణం యూత్ లో ఆమెకి ఉన్న క్రేజ్..అయితే ఈమె లేటెస్ట్ గా అక్కినేని నాగార్జున – ప్రసన్న కుమార్ కాంబినేషన్ తెరకెక్కబోతున్న సినిమాలో సినిమాలో గా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఈమె నాగార్జున ఇద్దరి కుమారులతో కలిసి ‘ఒక లైలా కోసం’ , ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి సినిమాల్లో నటించింది..ఇప్పుడు నాగార్జున తో రొమాన్స్ చెయ్యడానికి సిద్ధం అయిపోవడం తో నెటిజెన్స్ పూజా హెగ్డే పై ట్రోల్ల్స్ వేస్తున్నారు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకి రావాల్సి ఉంది.