Pooja Hegde : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్, ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే(Pooja Hegde). ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఈమె బాలీవుడ్ లోకి వెళ్లి వరుస ఫెయిల్యూర్స్ ని మూటగట్టుకుంది. తెలుగు లో ఆమె చేస్తున్న కొన్ని క్రేజీ మూవీస్ ని వదులుకొని మరీ ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడం గమనార్హం. బాలీవుడ్ స్టార్ హీరోలే అక్కడి మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడంతో టాలీవుడ్ లోకి వచ్చేయాలని చూస్తున్న ఈ రోజుల్లో పూజా హెగ్డే బాలీవుడ్ పై అమితాసక్తిని చూపించడం గమనార్హం. అయితే తమిళంలో రీసెంట్ గా ఈమె సూర్య(Suriya Sivakumar) తో కలిసి ‘రెట్రో'(Retro Movie) అనే చిత్రం చేసింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 1వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : పవన్ కళ్యాణ్ బాటలోనే ప్రభాస్..ఫ్యాన్స్ కి చుక్కలు చూపిస్తున్న హీరోలు!
ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో పూజ హెగ్డే చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె నిన్న ఒక ప్రముఖ టాలీవుడ్ టాప్ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె అనేక ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది. శ్రీదేవి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే, చేస్తారా లేదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పూజ హెగ్డే సమాధానం చెప్తూ ‘ఇంతకు ముందు శ్రీదేవి గారి ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’ రీమిక్స్ లో డ్యాన్స్ చేశాను’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. ‘అలాంటి మహానటి బయోపిక్ లో నటించే అవకాశం వస్తే అసలు వదులుకోను, కచ్చితంగా చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే తెలుగు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారు అని పూజ హెగ్డే ని అడగగా, ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను నటించిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రంలో అల్లు అర్జున్ గారు ఒక డైలాగ్ అంటారు గుర్తుందా. ‘నేను గ్యాప్ ఇవ్వలేదు..అదే వచ్చింది’ అని, అదే నాకు ఇప్పుడు వర్తిస్తుంది. కావాలని తెలుగు సినిమాలకు గ్యాప్ ఇవ్వలేదు, హిందీ లో కొన్ని సినిమాలను కమిట్ అవ్వాల్సి వచ్చింది, అందుకే గ్యాప్ వచ్చింది. రీసెంట్ గానే ఒక తెలుగు సినిమాలో నటించడానికి సంతకం చేశాను. అది నేను చెప్తే బాగుండదు, దర్శక నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఇక నుండి పూజ హెగ్డే లో సరికొత్త యాంగిల్స్ ని చూస్తారని, కేవలం నటనకు ప్రాధన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఇప్పుడు ఒప్పుకుంటున్నానని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ‘రెట్రో’ లో ఒక 15 నిమిషాల సన్నివేశాన్ని పూజా హెగ్డే, సూర్య కలిసి సింగిల్ టేక్ లో చేశారట. అది చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.
