Pooja Hegde: స్టార్ లేడీ పూజా హెగ్డే చేతిలో ఒక్క తెలుగు మూవీ లేదు. సాయి ధరమ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది ఓ చిత్రం తెరకెక్కిస్తుండగా అందులో హీరోయిన్ గా ఎంపికైందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే గుంటూరు కారం మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందట. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. గత రెండేళ్లుగా పూజా హెగ్డే కెరీర్ స్ట్రగుల్ అవుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వరకూ ఆమె హవా నడిచింది. పట్టింది బంగారమైంది. 2022 నుండి ఆమె ఫ్లేట్ తిరగబడింది.
ఏమంటూ రాధే శ్యామ్ చేసిందో కానీ… ఆ మూవీతో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. దారుణంగా ఒప్పుకున్న చిత్రాలు కూడా చేజారుతున్నాయి. జనగణమన మూవీ మధ్యలో ఆగిపోగా… గుంటూరు కారణ నుండి తప్పుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం పూజా హెగ్డే నటించాల్సింది. పవన్ కళ్యాణ్ పక్కన నటించే క్రేజీ ఛాన్స్ పూజా హెగ్డే కోల్పోయింది. పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కీసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
దీంతో ఒక్కసారిగా పూజా హెగ్డే మార్కెట్ పడిపోయింది. కెరీర్ బిగినింగ్ నుండి పూజా స్ట్రగుల్ అవుతుంది. భారీ ఆఫర్స్ దక్కినా హిట్స్ పడేవి కావు. దర్శకుడు త్రివిక్రమ్ పూజా హెగ్డేకి లిఫ్ట్ ఇచ్చాడు. ప్లాప్స్ లో ఉన్న పూజాకు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఆఫర్ ఇచ్చాడు. ఆ మూవీ హిట్ కావడంతో పూజాకు మరలా అవకాశాలు దక్కాయి. అల వైకుంఠపురంలో మూవీతో పూజా హెగ్డే ఇండస్ట్రీ హిట్ అందుకుంది.
పరాజయాలకు తోడు పూజా హెగ్డేపై పలు రూమర్స్ వినిపించాయి. పూజా హెగ్డే-సల్మాన్ ఖాన్ మధ్య ఎఫైర్ అంటూ కథనాలు వచ్చాయి. ఈ వార్తలను సల్మాన్ ఖాన్ టీమ్ ఖండించారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో పూజా ఎఫైర్ నడిపారనే వాదన కూడా ఉంది. పూజా హెగ్డేకు అర్జెంటుగా భారీ హిట్ కావాలి. లేదంటే ఆమె ఫేడ్ అవుట్ అయినట్లే. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ వేదికగా మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పింక్ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించి సూపర్ గ్లామరస్ గా కనిపించింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram