Coolie : తమిళనాడు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రం గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో ఎలా అయినా వాళ్ళు మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాని అందుకోవాలని ఆరాటపడుతున్నారు. మన టాలీవుడ్ నుండి ఏకంగా నాలుగు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి, శాండిల్ వుడ్ నుండి ఒకటి, బాలీవుడ్ నుండి రెండు వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు ఉన్నాయి. కేవలం మాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ లకు మాత్రమే వెయ్యి కోట్ల గ్రాస్ సినిమాలు లేవు. మాలీవుడ్ చిన్న ఇండస్ట్రీ కాబట్టి వాళ్ళ మీద ఆ స్థాయి అంచనాలు పెట్టుకోవడం కూడా సబబు కాదు, కానీ కోలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ నే. ఈసారి కొట్టకపోతే వాళ్ళ పరువు పోయే అవకాశాలు ఉన్నాయి. ‘లియో’ చిత్రం కచ్చితంగా కొట్టేది.
Also Read : విడుదలకు ముందే 750 కోట్లు..చరిత్ర సృష్టించిన రజినీకాంత్ ‘కూలీ’
కానీ ఆ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. దీంతో 650 కోట్ల రూపాయిల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే విధంగా రజినీకాంత్ జైలర్ చిత్రానికి ఇదే స్థాయి వసూళ్లు వచ్చాయి. సౌత్ మార్కెట్స్ లో రజినీకాంత్ కి తిరుగులేదు కానీ, ఆయనకు ఈమధ్య బాలీవుడ్ మార్కెట్ పెద్దగా కలిసి రావడం లేదు. అందుకే ఈసారి అమీర్ ఖాన్(Amir Khan) సహాయం తీసుకోబోతున్నాడు. ‘కూలీ’ చిత్రంలో అమీర్ ఖాన్ 5 నిమిషాల పవర్ ఫుల్ గెస్ట్ రోల్ చేశాడట. ఈ సినిమాకి ఆయన గెస్ట్ రోల్ పెద్ద హైలైట్ కాబోతుందని, సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో అతిథి పాత్ర చేసినందుకు గానూ అమీర్ ఖాన్ పాతిక నుండి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అంతే కాదు ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి వచ్చే లాభాల్లో కూడా వాటాలు అందుకోబోతున్నాడట.
ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడంటే, కచ్చితంగా బాలీవుడ్ లో క్లిక్ అయ్యే రేంజ్ లోనే ఆయన క్యారక్టర్ ని డిజైన్ చేసి ఉంటారని అనుకుంటున్నారు నెటిజెన్స్. బాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే లెక్క ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాబట్టి ఈ సినిమాకు కచ్చితంగా హిందీ లో క్లిక్ అవుతుందని అనుకుంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో కేవలం అమీర్ ఖాన్ మాత్రమే కాదు, టాలీవుడ్ నుండి అక్కినేని నాగార్జున,.శాండిల్ వుడ్ నుండి ఉపేంద్ర వంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్స్ ఉన్నారు కాబట్టి, సరిగ్గా ఈ చిత్రాన్ని డీల్ చేస్తే వెయ్యి కోట్లు కాదు, రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆగస్టు 14 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నిజంగా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read : రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్..రజినీ మార్కెట్ చెక్కు చెదరలేదుగా!