Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న చిత్రాలలో ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా , దానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మన అందరం చూసాము. చూడగానే బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది అనే ఫీలింగ్ ని రప్పించింది ఈ గ్లిమ్స్ వీడియో.
ఇందులో పవన్ కళ్యాణ్ మార్క్ స్టైల్ , యాటిట్యూడ్ మరియు డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ విధాలుగా ఫ్యాన్స్ పవర్ స్టార్ నుండి ఏదైతే కోరుకుంటారో అవన్నీ చూపించాడు హరీష్ శంకర్. ఈ గ్లిమ్స్ వీడియో ని చూసిన తర్వాత ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ నీ రేంజ్ లో ఎవ్వరూ చూపించలేరు, నీ తర్వాతే ఎవరైనా అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, పొలిటికల్ నేపథ్యం కూడా బలంగానే ఉంటుందట. హరీష్ శంకర్ మొదటి నుండి పోస్టర్స్ లో ఈ విషయాన్నీ చెప్తూనే వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఎలివేట్ చేస్తూ అద్భుతమైన పొలిటికల్ డైలాగ్స్ ని రాసాడట డైరెక్టర్ హరీష్ శంకర్. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్.
ఆయన రాసిన ప్రతీ డైలాగ్ పవన్ కళ్యాణ్ నోటి నుండి వస్తుంటే, గన్ నుండి ఫైర్ అయినా బుల్లెట్స్ లాగ ఉండేవి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో డైలాగ్స్ అంతకు మించి ఉంటాయట. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా,రెండవ షెడ్యూల్ ని వచ్చే నెల 26 వ తారీఖున నుండి జరపబోతున్నారు.