కరోనా సెకండ్ వేవ్ లో ఆపదలో ఉన్న వారిని హీరో నిఖిల్ ఆదుకుంటున్నాడు. ట్విట్ చేసిన వారికి మందులు, ఇంజెక్షన్లు, ఆక్సిజన్, బెడ్స్ తదితర సౌకర్యాలను సమకూరుస్తున్నాడు. సోనూ సూద్ అంత కాకపోయినా హైదరాబాద్ పరిధిలో హీరో నిఖిల్ తన చేతనైన సాయం చేస్తున్నాడు.
అయితే తాజాగా ఓ రోగికి అత్యవసరంగా మందులు కావాలని ఒకరు ట్వీట్ చేయగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రోగి కోసం హీరో నిఖిల్ బయటకొచ్చాడు. ఉప్పల్ నుంచి మినిస్టర్ రోడ్ కిమ్స్ కు ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ మందులను తీసుకొని అందించేందుకు వెళ్తుండగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో నిఖిల్ ఆ రోగి వివరాలు, ప్రిస్కిప్షన్ అందించాడు. అయినా ఈపాస్ ఉంటే బయటకు అనుమతిస్తామని అది తీసుకోవాలని పోలీసులు సూచించారు.
దీంతో హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్న పోలీసులు ఈపాస్ అడిగారని.. తాను 9 సార్లు ట్రై చేసినా సర్వర్ బిజీతో అనుమతి రాలేదని ట్వీట్ చేశాడు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ప్రభుత్వం అనుమతించాలని కోరాడు.
అయితే నిఖిల్ ట్వీట్ కు స్పందించిన పోలీసులు వెంటనే ఆయన ఉన్న లోకేషన్ చెప్పాలని.. తాము పోలీసులకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని ట్వీట్ చేశారు. నిఖిల్ సమాచారం అందించగా పోలీసులు హీరోకు లైన్ క్లియర్ చేసి పంపించారు. ఈ క్రమంలోనే అత్యవసరంగా అవసరం ఉన్నవారికి అనుమతించాలని పలువురు కోరుతున్నారు.
Was on the way to deliver Emergency Life saving Medicines from Uppal to Kims Minister road… Inspite of providing the Prescription and patient details.. was stopped and asked to Get an Epass.
Tried 9 times but the sever is down…
I thought medical emergencies were allowed!!! pic.twitter.com/qEVWqlJkGj— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2021