హీరోల కోసం కథలు రాయకుండా.. ప్రేక్షకుల కోసం కథలు రాసే ఇండస్ట్రీలు ఏవైనా ఉన్నాయా..? అని చూసినప్పుడు ప్రముఖంగా కనిపించే సినీ ఇండస్ట్రీ మోలీవుడ్. డిఫరెంట్ జోనర్లలో సినిమాలను తెరకెక్కిస్తూ కేవలం మలయాళం ప్రేక్షకులను కాకుండా.. యావత్ ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మోలీవుడ్ మేకర్స్. ఈ మధ్య వచ్చిన పలు సినిమాలను చూస్తే.. ఇది ఖచ్చితంగా నిజమేనని అంగీకరిస్తారు మీరు కూడా. ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్న చిత్రాలు ఏడున్నాయి. అవేంటీ? వాటి ప్రత్యేకత ఏంటీ? అన్నది చూద్దాం.
ఇందులో మొదటి మూవీ దృశ్యం. మొదటి పార్టుతోనే ప్రేక్షకులను మునివేళ్ల మీద కూర్చోబెట్టిన ఈ సినిమా సీక్వెల్ కూడా ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. సీక్వెల్ గా వచ్చిన సినిమాల్లో వేళ్లమీద లెక్కబెట్టగలిగేవి మాత్రమే మొదటి సినిమాకు ధీటుగా ఆడాయి. అలాంటి వాటిల్లో ముందు వరసలో ఉంటుంది దృశ్యం-2. మొదటి సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీనికి మూడో పార్ట్ కూడా రాబోతోందని కన్ఫామ్ చేశారు దర్శకుడు జీతూ జోసెఫ్. ఈ సినిమాను గనక మీరు చూడనట్టైతే ఇప్పుడే చూసేయండి.
ఇక, నెక్స్ట్ మూవీ ‘బిర్యానీ’. కేరళలో ముస్లిం ఉమెన్ పడే ఇబ్బందుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ముస్లిం మహిళలు ఎదుర్కొనే సమస్యలను బోల్డ్ గా డిస్కస్ చేసిన ఈ మూవీ.. అందరినీ ఆకట్టుకుంది. ఇది మలయాలం ఓటీటీలో అందుబాటులో ఉంది.
మూడో సినిమా నాయట్టు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి. కానీ.. వాటన్నింటినీ తలదన్నే మూవీ నాయట్టు అని చెప్పొచ్చు. డిపార్ట్ మెంట్ ఇన్ సైడ్ లోని ముగ్గురు పోలీసుల కథ ఇది. దర్శకుడు మార్టిన్.. ఎక్కడా లీనియన్స్ కు చోటివ్వకుండా.. ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించేలా సినిమాను కొనసాగించారు. సూపర్బ్ థ్రిల్లర్ మూవీ కావాలనుకునేవారు దీన్ని చూజ్ చేసుకోకోవచ్చు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మలయాళం నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాల్లో ఒకటి ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. కొత్తగా పెళ్లయిన యువతిని సాంప్రదాయాల మాటున ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తారనేది ఈ మూవీ. ఎంతో హృద్యంగా మహిళల సమస్యను చర్చించారీ సినిమాలో. ఇప్పటి వరకు మీరు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఐదో అద్భుతమైన మూవీ నిజల్. ఓ చిన్నారి స్కూల్లో రాసుకున్న క్రైమ్ స్టోరీని బేస్ చేసుకొని సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఆద్యంతం ట్విస్టులతో సాగిపోయే ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ ను చూశారంటే బుర్ర తిరిగిపోవడం ఖాయం. ఎంతో ఆసక్తిని రేకెత్తించే ఈ మూవీ కూడా ఓటీటీలో దుమ్ములేపుతోంది.
ఆరో చిత్రం ‘కిలోమీటర్స్ కిలోమీటర్స్.’ ఓ అమ్మాయి రోడ్ జర్నీ చేయాలని అనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఓ అబ్బాయి పరిచయం అవుతాడు. వీళ్ల జర్నీ కిలోమీటర్లు దాటుకుంటూ సాగిపోతూనే ఉంటుంది. ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఫన్నీ అండ్ క్యూట్ జర్నీ అద్భుతంగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
ఇక చివరి ఏడో చిత్రం ‘ఆపరేషన్ జావా’. డిజిటల్ ఫ్రాడ్ తో సెకన్లలో మనిషి జీవితం ఎలా దెబ్బ తిన్నదో చూపించే చిత్రం ఇది. ఆన్ లైన్ మోసాలు ఏ విధంగా పెరిగిపోతున్నాయో తెలిసిందే. ఈ విషయాన్ని బేస్ చేసుకొని అద్దిరిపోయే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుడిని స్క్రీన్ కట్టేసే చిత్రం ఇది. జీ5లో అందుబాటులో ఉంది. వీలైతే ఈ చిత్రాలన్నీ చూడండి. అద్భుతమైన అనుభూతికి మాదీ గ్యారంటీ.