Pokiri: ఇక ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. పోకిరి సినిమాలో బోల్డ్ రోల్ లో కనిపించిన ఒక నటి మీకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చినప్పటికి కూడా తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. గత కొంత కాలం నుంచి ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం మీ మతి పోవాల్సిందే. పోకిరి సినిమా తర్వాత మహేష్ బాబు కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
Also Read: షాకింగ్ లుక్ లో మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్.. ఎవరంటే…
మహేష్ బాబు కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లలో పోకిరి సినిమా కూడా ఒకటి. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు అన్నిటిని కూడా ఈ సినిమా తిరగరాసింది. ఇక పోకిరి సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్ మరియు లుక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ సరికొత్త స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించి తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఈ సినిమాలో ఉన్న అన్ని పాత్రలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పోకిరి సినిమాలో నటించిన జ్యోతి రానా ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. అయితే జ్యోతి రానా పేరు చెబితే ప్రేక్షకులు గుర్తుపట్టలేక పోవచ్చు కానీ విలన్ గ్యాంగ్ లో హీరో వైపు మత్తుగా చూసే అమ్మాయి అంటే మాత్రం బాగా గుర్తుపడతారు. ఈ సినిమాలో విలన్ ప్రకాష్ రాజు గల్ఫ్ ఫ్రెండ్ గా ఈ చిన్నది మాఫియా గ్యాంగ్ లీడ్ చేసే లేడీ విలన్ పాత్రలో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది.
View this post on Instagram
కానీ ఈ సినిమా తర్వాత పోకిరి సినిమా తర్వాత తెలుగు సినిమాలలో పెద్దగా మెప్పించలేకపోయింది. గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న జ్యోతి రానా ప్రస్తుతం సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్ గా పని చేస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది యోగా క్లాసులు చెప్తూ తనకు నచ్చిన జీవితాన్ని గడుపుతుంది. అయితే ఒకప్పుడు పోకిరి సినిమాలో ఎంత గ్లామర్ గా ఉందో ప్రస్తుతం 42 ఏళ్ళ వయసులో కూడా అంతే గ్లామర్ గా ఉంది. ఈమెను చూస్తే యోగ అందరిని మెంటల్ గా మరియు ఫిజికల్ గా అందంగా ఉంచుతుంది అని తెలుసుకోవచ్చు. పోకిరి సినిమాలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జ్యోతి రానాకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.
Also Read: శ్రీదేవి పర్సనల్ లైఫ్ పై అల్లు అర్జున్ కామెంట్స్! ఏమన్నారో తెలుసా?