Johnny Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ అనే యంగ్ డ్యాన్సర్ తన పై లైంగిక వేధింపులు చేస్తున్నాడని, అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అని, తన ఇంటికి వచ్చి మతం మార్చుకొని నన్ను పెళ్లి చేసుకోమంటూ బెదిరిస్తున్నారని, నా బిడ్డని కూడా చంపేస్తాం అంటున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ FIR నమోదు చేసింది. ఢీ షో లో ఈమె ఒక కంటెస్టెంట్ గా జానీ మాస్టర్ కి పరిచయం అయ్యింది. మంచి టాలెంట్ ఉన్న ఈ అమ్మాయిని జానీ మాస్టర్ తన టీంలోకి తీసుకున్నాడు. 5 ఏళ్ళ పాటు ఆయన టీం లో అసిస్టెంట్ డ్యాన్సర్ గా కొనసాగిన శ్రేష్టి వర్మ, జానీ మాస్టర్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆయన టీం నుండి ఏడాదిన్నర క్రితమే బయటకి వచ్చేసిందట. సొంతంగా కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీ లో తన ప్రస్థానం ప్రారంభించింది.
టీవీ సెలెబ్రిటీలతో పలు వీడియో సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసిన శ్రేష్టి వర్మ, రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రంలో కూడా ఒక పాటకు కొరియోగ్రఫీ చేసింది. అలా ఇండస్ట్రీ లో నెమ్మదిగా ఎదుగుతున్న ఆమెని జానీ మాస్టర్ ఇప్పటికీ వదలలేదట. ఆమెని అనేక విధాలుగా బెదిరిస్తూ లైంగిక వేధింపులకు గురి చేసాడట. ఇక సహనం నశించిన శ్రేష్టి వర్మ ఒక అడుగు ముందుకేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. దీనిపై విచారణ చేపడుతున్న పోలీసులు జానీ మాస్టర్ పై నేడు పోక్సో చట్టం క్రింద కేసుని నమోదు చేసింది. శ్రేష్టి వర్మ మైనర్ బాలికగా ఉన్నప్పటి నుండే జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేసేవాడట. ఇది చట్ట రీత్యా పెద్ద నేరం కాబట్టి ఆయనపై ఈ కేసుని నమోదు చేసారు. అయితే జానీ మాస్టర్ ని విచారించేందుకు పోలీసులు గత రెండు రోజులుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన అజ్ఞాతం లో ఉన్నాడు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.
చూస్తూ ఉంటే జానీ మాస్టర్ కెరీర్ రిస్క్ లో పడినట్టు అనిపిస్తుంది. ఇండియా లోనే టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా కొనసాగుతున్న సమయంలో ఒక స్త్రీ మోజులో పడి కెరీర్ ని సర్వనాశనం చేసుకున్నాడని జానీ మాస్టర్ ని అభిమానించే వాళ్ళు అంటున్నారు. తనపై ఎలాంటి రూమర్ వచ్చినా వెంటనే స్పందించి రియాక్షన్ ఇచ్చే జానీ మాస్టర్ ఇప్పుడు అజ్ఞాతం లోకి ఎందుకు వెళ్లినట్టు?, అసలు ఈ విషయం పై జానీ మాస్టర్ ఇంత మౌనం ఎందుకు వహిస్తున్నట్టు, అంటే ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు నిజమేనా?, ఒకవేళ ఇది నిజమే అయితే జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటోళ్ళ ఆగడాలకు ఇండస్ట్రీ లో అడ్డే లేకుండా పోతుంది.